Share News

Viral Video: వరుడికి ఎంత అవమానం జరిగింది..? వేదిక మీదకు వస్తూ వధువు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:17 PM

పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వధువు ప్రవర్తనపై కామెంట్లు కురిపిస్తున్నారు.

Viral Video: వరుడికి ఎంత అవమానం జరిగింది..? వేదిక మీదకు వస్తూ వధువు ఏం చేసిందో చూడండి..
Wedding Video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందరినీ ఆకట్టుకుని క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లికి (Wedding) సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లలో జరిగే ఫన్నీ ఘటనలు, ఆసక్తికర దృశ్యాలు బాగా వైరల్ అవుతున్నాయి (Wedding Video). ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన వధువు (Bride) ప్రవర్తనపై కామెంట్లు కురిపిస్తున్నారు (Viral Video).


@ArpitKushwah అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వివాహ వేదికపై వరుడు (Groom) ఉన్నాడు. వధువు అప్పుడే మెట్లు ఎక్కి పైకి వస్తోంది. ఆ సమయంలో వరుడు ఆమె దగ్గరకు వెళ్లి చెయ్యి అందించాడు. ఆ వధువు వరుడి చేయి అందుకుని గట్టిగా కిందకు లాగేసింది. దీంతో ఆ వరుడు స్టేజ్ పై నుంచి కిందకు పడిపోయాడు. వధువు స్టేజ్ పైకి వెళ్లి వరుడి వైపు చూసి నవ్వుకుంది. ఆ దృశ్యాన్ని చుట్టు పక్కల వాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.5 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో సింబాలిక్‌గా చూపించింది``, ``కింద పడడం అప్పుడే మొదలైంది``, ``అలా చేయడం తప్పు``, ``వీడియో కోసమే వాళ్లిద్దరూ అలా చేసినట్టు ఉన్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోలోని భిన్నంగా ఉన్న కోడిని గుర్తించండి..


Viral Video: వధూవరులు ఎవరికి కావాలి.. అతిథుల ధాటికి వడ్డించే వాళ్ల పరిస్థితి ఏమైందో చూడండి..


Viral Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినందుకు ఏం జరిగిందో తెలిస్తే..


Viral Video: పానీపూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగు ఎలా లొట్టలేసుకుంటూ తింటోందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2024 | 06:17 PM