Viral Video: వామ్మో.. ఇలా అయితే ఎలా.. వేదిక మీదే కొట్టుకున్న వధూవరులు.. వీడియో వైరల్..
ABN , Publish Date - Nov 29 , 2024 | 03:48 PM
వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియాలు, ఆసక్తికర వీడియోలు కూడా ఇకపై తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియాలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరుల ప్రవర్తన చూస్తే ఖంగు తినాల్సిందే.
ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల (Wedding) సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సీజన్‌లో భారతదేశంలో 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయట. ఈ సీజన్‌లో పెళ్లిళ్ల కోసం అందరూ కలిసి రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివాహాలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు (Wedding Videos), ఆసక్తికర వీడియోలు కూడా ఇకపై తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియాలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధూవరుల ప్రవర్తన చూస్తే ఖంగు తినాల్సిందే (Viral Video).
bridal_lehenga అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వివాహ వేదికపై ఉన్న వధూవరులు దండలు మార్చుకున్నారు. ఆ జయమాల కార్యక్రమం ముగిసిన వెంటనే వధూవరుల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ వాగ్వాదం క్రమంగా ముదిరిపోయి ఇద్దరూ ఒకరినొకరు ఎడాపెడా వాయించేసుకున్నారు. ఒకరినొకరు కసితీరా కొట్టేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన బంధువులు, పెళ్లికి హాజరైన అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చుట్టు పక్కల వారు వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినా వారిద్దరూ శాంతించలేదు.
ఈ వీడియో వివిధ సామజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ అయింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే``, ``పెళ్లి రోజే ఇలా ఉంటే.. ఆ తర్వాత ఎలా ఉంటారు``, ``వారిది లవ్ మ్యారేజ్ అనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వధూవరులు ఎవరికి కావాలి.. అతిథుల ధాటికి వడ్డించే వాళ్ల పరిస్థితి ఏమైందో చూడండి..
Viral Video: వామ్మో.. ఈమెకు ఏమైంది.. ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కినందుకు ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: పానీపూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఏనుగు ఎలా లొట్టలేసుకుంటూ తింటోందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి