Share News

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:14 PM

Bengaluru Love Breakup: తాజాగా ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె క్షుద్రపూజలను ఎంచుకుంది. కానీ, ఆమె ప్రయత్నం సక్సెస్ కాకపోగా.. రూ. 8.2 లక్షలు నష్టపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఓసారి తెలుసుకుందాం.

Love Breakup: మాజీ ప్రియుడి కోసం క్షుద్రపూజలు చేసిన అమ్మాయి.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
Love Affair

బెంగళూరు, జనవరి 23: ఒక వ్యక్తి ప్రేమను పొందడం అంత సులువైన పని కాదు.. పొందిన ప్రేమను నిలబెట్టుకోవడం కూడా పెద్ద టాస్కే. ప్రేమ నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆ నమ్మకం, విశ్వాసం సన్నగిల్లితే.. ఆటోమాటిక్‌గా ప్రేమ కూడా దూరమవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రేమలో పడని యువతీ యువకులు లేరంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ప్రేమకు చాలా ప్రాధాన్యత ఉండేది. ప్రేమికులు తమ ఎంతో ప్రేమకు విలువ ఇచ్చేవారు. ప్రేమ అంటే ఒక అర్థం ఉండేది. కానీ, ఇప్పుడు ప్రేమ అంటే ఒక టైమ్ పాస్ అయిపోయింది. దాదాపు చాలా మంది యువతీ యువకులు.. తమ అవసరాలకు, ఎంజాయ్ కోసం ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయినప్పటికీ.. ఈ కాలంలోనూ కొందరు తమ భాగస్వామిని చాలా నిజాయితీగా ప్రేమిస్తుంటారు. కానీ, అవతలి వారి ప్రేమలో నిజాయితీ ఉండదు. ఫలితంగా.. ఆ జంటలు చాలా తొందరగా విడిపోతుంటారు. లవ్ బ్రేకప్‌ నుంచి తేరుకోలేక, ప్రేమించిన వారిని మర్చిపోలేక.. కొందరు ప్రాణ త్యాగం చేసుకుంటే.. మరికొందరు తమ జీవితాలనే నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రేమ కోసం క్షుద్రపూజలు..

తాజాగా ఓ యువతి.. తన మాజీ ప్రియుడిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె క్షుద్రపూజలను ఎంచుకుంది. కానీ, ఆమె ప్రయత్నం సక్సెస్ కాకపోగా.. రూ. 8.2 లక్షలు నష్టపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఓసారి తెలుసుకుందాం. బెంగళూరులోని జలహళ్లిలో నివాసం ఉంటున్న యువతి(25).. ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, అతనితో బ్రేకప్ అవగా.. ఆ బాధను తట్టుకోలేకపోయింది. తీవ్ర మానసిక వేధనకు గురైన యువతి.. తన భాగస్వామితో మళ్లీ సంబంధం కొనసాగించాలని భావించింది. అతనికి తెలియకుండానే.. అతన్ని తనవైపు తిప్పుకోవాలని అనుకుంది. ఇందుకోసం తన స్నేహితుల సహకారంతో ఓ జ్యోతిష్యుడిని కలిసింది. ఈ కేటుగాడు తనకు దొరికిందే ఛాన్స్ అని భావించి.. ముందుగా రూ. 501 రుసుముగా తీసుకుని కొన్ని టిప్స్ చెప్పాడు. తన ప్రియుడు తనకు దగ్గరవ్వాలంటే.. కొన్ని పరిహారాలు చేయాలని యువతికి సూచించాడు.

గుడ్డిగా ఇచ్చేసిన యువతి..

తన మాజీ ప్రియుడు, అతని కుటుంబ సభ్యులపై చేతబడి చేసి తనకు మచ్చికయ్యేలా చూడాలని కోరింది యువతి. దానికి ఓకే చెప్పిన సదరు జ్యోతిష్యుడు.. ఇందుకోసం రూ. 2.4 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. చేతబడి కోసం యువతి తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న పర్సనల్ ఫోటోలు, అతని కుటుంబ సభ్యుల ఫోటోలు ఇవ్వాలని కోరగా.. నిస్సందేహంగా ఇచ్చేసింది. ఇక ఈ ప్రక్రియ చేస్తే యువతి ప్రేమ ఫలిస్తుందని, కుటుంబ సభ్యులు సైతం వారి ప్రేమకు అంగీకారం తెలుపుతారని చెప్పడంతో.. గుడ్డిగా రూ. 2.4 లక్షలను జ్యోతిష్యుడికి డిజిటల్ రూపంలో పంపించింది యువతి. అంతటితో ఆగని జ్యోతిష్యుడు.. కొన్ని రోజుల తరువాత అదనంగా రూ. 1.7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. కానీ, అప్పుడు అనుమానించిన యువతి.. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది.

బయటపడ్డ అసలు బాగోతం..

దీంతో ఆ జ్యోతిష్యుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తాను అడిగినట్లుగా డబ్బులు ఇవ్వకపోతే.. తన ప్రియుడితో దిగిన పర్సనల్ ఫోటోలు బహిర్గతం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో భయపడిపోయిన యువతి.. పలు దఫాలుగా జ్యోతిష్యుడికి డబ్బులు పంపించింది. మొత్తంగా రూ. 8.2 లక్షలు పంపింది. అతని వేధింపులు ఇంకా ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించింది యువతి. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని జైల్లో వేశారు.

Updated Date - Jan 23 , 2024 | 04:14 PM