Share News

Viral: వామ్మో.. భలే చికిత్స.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడుగా!

ABN , Publish Date - Jun 03 , 2024 | 10:00 PM

టర్కీలో ఓ వైద్య కేంద్రం దాదాపు అద్భుతం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓ వ్యక్తి ముఖాకృతినే మార్చేసి, యవ్వనం ఉట్టిపడేలా చేసింది. ఈ ఫొటోలు చూసి జనాలు షాకైపోతున్నారు.

Viral: వామ్మో.. భలే చికిత్స.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడుగా!

ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎవరూ తప్పించుకోలేని దశ ముసలితనం. కానీ ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాక కాలం కూడా వెనక్కు నడవడం మొదలెట్టింది. అనేక మంది రకరకాల శస్త్రచికిత్సలతో యవ్వనంగా.. పదేళ్ల వయసు తగ్గినట్టు కనిపిస్తున్నారు. తాజాగా టర్కీలో ఓ వైద్య కేంద్రం ఇలాంటి అద్భుతం చేసింది. కనీవినీ ఎరుగని రీతిలో ఓ వ్యక్తి ముఖాకృతినే మార్చేసి, యవ్వనం ఉట్టిపడేలా చేసింది. ఈ ఫొటోలు చూసి జనాలు షాకైపోతున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ (Viral) అవుతోంది.

Viral: సీఏ చదివిన యువకుడు.. బ్రేకప్ తరువాత గర్ల్‌ఫ్రెండ్‌కు భారీ షాకిచ్చాడుగా!


పెద్ద వయసులో ముఖం అందంగా మారాలంటే రకరకాల ఆపరేషన్లు చేయాలని సదరు వైద్య కేంద్రం పేర్కొంది. కేవలం ముక్కు ఆపరేషన్ లేదా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తో మాత్రమే తాము సరిపెట్టమని చెప్పుకొచ్చింది. పరిపూర్ణ చికిత్స అందించి కోల్పోయన యవ్వనాన్ని తిరిగి అందిస్తామని పేర్కొంది. ఇందుకు తగ్గట్టుగా ఆ ఫొటోని వ్యక్తిని చూసి జనాలు షాకైపోతున్నారు (Before And After Pic Of Man After Facial Surgery In Turkey Leaves Internet In Disbelief). ఫొటోలో ఎడమవైపు ఉన్న వ్యక్తి ఫేస్ లిఫ్ట్, నెక్ లిఫ్ట్, ఐలిడ్ సర్జరీ, అప్పర్ బ్లెఫారో ప్లాస్టీ, బక్కల్ ఫ్యాట్ రిమోవల్, రైనో ప్లాస్టీ, హెయిర్ ట్రాన్స్ ప్లాన్టేషన్ వంటి శస్త్రచికిత్స చేసి గుర్తుపట్టలేనంతగా మార్చేసింది. పూర్తిగా మారిపోయిన మనిషి ఫొటో కుడివైపు ఉంది.

ఇది చూసి జనాలు షాకైపోతున్నారు. అసలు వాళ్లిద్దరూ ఒక్కరే అనే గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరూ ఒకటని చెప్పేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు చూపించాలని మరో వక్తి డిమాండ్ చేశాడు. తనకు లాటరీ తగిలాక కచ్చితంగా ఈ వైద్య కేంద్రంలో ముఖం మొత్తం మారిపోయేలా చికిత్స చేయించుకుంటానని ఓ వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 10:28 PM