Share News

Anand Mahindra: మనం కూడా దీన్ని అభివ‌ృద్ధి చేయాలి.. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా

ABN , Publish Date - Apr 16 , 2024 | 04:08 PM

ఇరాన్ ప్రయోగించిన 300 పైచిలుకు మిసైళ్లు తమ భూభాగంలోకి రాకుండా మార్గమధ్యంలో నిర్వీర్యం చేసిన ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

Anand Mahindra: మనం కూడా దీన్ని అభివ‌ృద్ధి చేయాలి.. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ ప్రయోగించిన 300 పైచిలుకు మిసైళ్లు తమ భూభాగంలోకి రాకుండా మార్గమధ్యంలోనే నిర్వీర్యం చేసిన ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ప్రశంసలు కురిపించారు. భారత్ కూడా ఇలాంటి మిసైల్ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ (Viral) అయ్యింది.

‘‘వారి వద్ద (ఇజ్రాయెల్) ఐరన్ డోమ్ వ్యవస్థే కాకుండా మరో దీర్ఘశ్రేణి క్షిపణి నిరోధక వ్యవస్థ డేవిడ్ స్లింగ్ ఉంది. యారో 2, యారో 3 క్షిపణి నిరోధక వ్యవస్థలు కూడా ఉన్నాయి. లేజర్ ఆధారిత క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ బీమ్‌‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో కీలకం. శత్రువులపై దాడికి అత్యాధునిక ఆయుధాలతో పాటు ఇలాంటి రక్షణ వ్యవస్థలపై కూడా మనం దేశభద్రత కోసం దృష్టిపెట్టాలి’’ అని ఆయన సూచించారు (India must invest in israel like defence systems).

Viral: ఇతడు నాగు పామును ఎలా బంధించాడో చూడండి.. ఈ ట్రిక్ ఎక్కడా చూసుండరు!


ఎప్పటిలాగే ఆనంద్ మహీంద్రా పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఈ పోస్టుకు 2.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే, అనేక మంది పలు ఇతర అంశాలను కూడా ప్రస్తావించారు. ‘‘అన్నికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇజ్రాయెల్‌కు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇతర దేశాల వాయుసేనలు.. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో సహాయపడ్డాయి. ఇవే దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధాలు కూడా సరఫరా చేస్తున్నాయి’’ అని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. ‘‘నిజమే..భారత్ తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నేర్చుకోవాలి. ఆయుధాల పరిశోధనపై మరింత పెట్టుబడి పెట్టాలి’’ అని మరో వ్యక్తి ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. -రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తే దేశానికి ఉపయోగకరమని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 04:27 PM