Share News

Anand Mahindra: కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:29 PM

మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పలు రకాల వీడియోలు, పోస్టులను చేస్తూ అనేక మందితో కనెక్ట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు

Anand Mahindra: కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పలు రకాల వీడియోలు, పోస్టులను చేస్తూ అనేక మందితో కనెక్ట్ అవుతుంటారు. ఆ క్రమంలో ఎవరైనా ఆటల్లో లేదా ఇతర విషయాల్లో ప్రతిభ చూపిస్తే వారికి బహుమతులను అందిస్తూ ప్రోత్సహిస్తారు. ఇలా గతంలో అనేక మందికి అందించారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు.


శనివారం ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)కు చెందిన ఓ ధైర్యవంతురాలైన బాలిక చేసిన ఘనతను చూసి ఆయన ముగ్ధులయ్యారు. నిజానికి ఆ అమ్మాయి తన బంధువైన 15 నెలల చిన్నారితో గదిలో ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించింది. ఆ క్రమంలో నానా రచ్చ చేశాయి. దీంతో బాలిక భయాందోళన చెందకుండా తనను, చిన్నారిని రక్షించుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించింది. ఇంట్లోకి వచ్చిన కోతుల గుంపును తరిమి కొట్టేందుకు 'అలెక్సా'ను కుక్కలా మొరగమని సూచించింది. దీంతో ఆ చిన్నారి వాయిస్ పసిగట్టిన అలెక్సా(Alexa) శునకాల మాదిరిగా అరవడంతో కోతులు భయంతో పారిపోయాయి. ఆ క్రమంలో అమ్మాయి విజయవంతంగా తనను, ఆమె బంధువుల చిన్నారని రక్షించి ఔరా అనిపించుకుంది.


ఇది తెలిసిన ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తన అధికారిక సోషల్ మీడియా(social media) ఎక్స్ వేదికగా స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా మనం బానిసలుగా మారతామా లేదా మాస్టర్స్ అవుతామా అనేది ప్రస్తుత యుగం ప్రధాన ప్రశ్న. కానీ ఈ యువతి కథ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుని మానవ చాతుర్యానికి ఓదార్పునిచ్చిందని వెల్లడించారు. బస్తీ జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక(Nikita Pandey), ధైర్యం, తెలివిని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, ఎప్పుడైనా వచ్చి కార్పొరేట్ ప్రపంచంలో పనిచేయాలని నిర్ణయించుకుంటే, తాము తీసుకుంటామని వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

Viral Video: తలపై కొబ్బరికాయను పగులగొట్టిన వ్యక్తి.. మరుక్షణంలో షాకింగ్ ట్విస్ట్..


రాళ్లను మోస్తూ.. పర్వతాలు ఎక్కుతూ


మరిన్ని ప్రత్యేక వార్తల కోసం

Updated Date - Apr 07 , 2024 | 12:32 PM