Share News

Viral: ఏ పనీ చేయకుండా రూ.3 కోట్ల జీతం తీసుకున్నా: అమెజాన్ ఉన్నతోద్యోగి

ABN , Publish Date - Aug 24 , 2024 | 06:30 PM

తాను దాదాపుగా ఏ పనీ చేయకుండా ఏకంగా మూడు కోట్ల శాలరీ తీసుకుంటున్నానన్న ఓ అమెజాన్ ఉన్నతోద్యోగి ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. కొందరు అతడి తీరును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.

Viral: ఏ పనీ చేయకుండా రూ.3 కోట్ల జీతం తీసుకున్నా: అమెజాన్ ఉన్నతోద్యోగి

ఇంటర్నెట్ డెస్క్: వృత్తి జీవితంలో విజయం సాధించడమంటే పనిలో లక్ష్యాలను చేరుకోవడం, మంచి జీతాన్ని అందుకోవడమే. కానీ, అమెజాన్ సంస్థకు చెందిన ఓ ఉన్నతోద్యోగి మాత్రం పెద్దగా పనేమీ చేయకుండానే రూ.3 కోట్ల జీతం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తే స్వయంగా వెల్లడించారు. వృత్తినిపుణులు అజ్ఞాతంగా తమ అనుభవాలను పంచుకునే వేదిక బ్లైండ్‌లో సదరు ఉన్నతోద్యోగి స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. దీంతో, ఈ పోస్టు నెట్టింట సంచలనంగా (Viral) మారింది.

Viral: ఇతడు నిజంగా సింహం లాంటోడే! గ్యాస్ సిలిండర్‌ నుంచి మంటలు ఎగసిపడుతుంటే..


అమెజాన్‌లో తాను సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. లేఆఫ్స్ కారణంగా గూగుల్‌లో ఉద్యోగం పోయాక తాను అమెజాన్‌లో చేరినట్టు వివరించారు. సంవత్సరన్నర నుంచి పనిచేస్తున్నట్టు తెలిపారు. గూగుల్‌లో ఉద్యోగం పోయాక ఏమీ చేయకుండానే జీతం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తాను అమెజాన్‌లో చేరినట్టు చెప్పారు. వారంలో 8 గంటలే పనికి కేటాయించేవాణ్ణని, అదీ మీటింగుల్లోనే గడిపేవాడినని చెప్పుకొచ్చారు. సంస్థ నిర్దేశించిన కింగ్‌పిన్ లక్ష్యాలు ఏవీ తనకు లేవని, ఏడు సమస్యలను మాత్రమే పరిష్కరించానని తెలిపారు. చాట్‌జీపీటీ ఉపయోగించి ఓ ఆటోమేటెడ్ డ్యాష్‌బోర్డును మూడు రోజుల్లో నిర్మించానని, కానీ సంస్థకు మాత్రం తనకు ఇది మూడు నెలల సమయం పట్టినట్టు తెలిపానని అన్నారు (Amazon Employee Admits Earning Rs 3 Crore For Doing Almost Nothing).

రోజులో 8 గంటలు విధుల్లో ఉన్నా ఇతర టీమ్స్ నుంచి వచ్చే విజ్ఞప్తుల్ని తిరస్కరిస్తూ గడిపేవాడినని గర్వంగా పేర్కొన్నాడు. 95 శాతం పనులను ఇతరులకు అప్పగించే వాడినని అన్నారు.


సదరు ఉద్యోగి ఉదంతం విన్న జనాలు రకరకాల కామెంట్లతో నెట్టింట హోరెత్తించారు. అతడు స్మార్ట్ వర్క్ చేశారని కొందరు అన్నారు. రెండు గంటలు పని చేసి ఎనిమిది గంటల శాలరీ తీసుకోవడం, వ్యక్తిగత జీవితానికి తగినంత సమయం కేటాయించడమంటే జీవితంలో విజయం సాధించడమేనని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా జనాలను మోసపుచ్చడం సరికాదని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారివల్లే కార్పొరేట్ కంపెనీల్లో లేఆఫ్స్ పెరిగిపోయాయని ఓ వ్యక్తి అభిప్రాపడ్డారు. మరికొందరు సదరు ఉన్నతోద్యోగికి అండగా నిలిచారు. జీవితమంతా పనికే కేటాయించడమంటే టాలెంట్ లేదని భావించాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అలాంటి వారికి సామర్థ్యం తక్కువని కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్న ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Aug 24 , 2024 | 07:04 PM