Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Viral Video: రివాల్వర్‌తో షూట్ చేసి రిబ్బన్ కట్ చేసిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే

ABN , Publish Date - Mar 03 , 2024 | 10:12 AM

ఓ వ్యక్తి పిల్లలు ఆడుకునే క్రికెట్ టోర్నీని వినూత్నంగా ప్రారంభించాడు. అది కూడా మాములాగా కాదండోయ్. ఏకంగా రివాల్వర్‌తో రిబ్బన్‌ను షూట్ చేసి ఆరంభించాడు. ఆ తర్వాత ఏమైందో ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: రివాల్వర్‌తో షూట్ చేసి రిబ్బన్ కట్ చేసిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే

ఓ వ్యక్తి పిల్లలు ఆడుకునే క్రికెట్ టోర్నీని వినూత్నంగా ప్రారంభించాడు. అది కూడా మాములాగా కాదండోయ్. ఏకంగా రివాల్వర్‌(revolver)తో రిబ్బన్‌ను షూట్ చేసి ఆరంభించాడు. ఆ క్రమంలో దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్(viral video) అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)లోని అంబేద్కర్‌నగర్‌(ambedkar nagar)లో చోటుచేసుకుంది.

ఈ విషయం స్థానిక పోలీసులకు(police) తెలియడంతో స్పందించి అతనిపై కేసు(case) నమోదు చేశారు. అయితే తొలుత అతని వేషధారణ చూసి స్థానిక నాయకుడని అనుకున్నారు. కానీ పోలీసులు విచారించగా ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. అతడు నాయకుడు కాదని, పారామిలటరీ దళం సైనికుడని తేలింది. అతను ఒక రోజు సెలవుపై తన గ్రామానికి చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు.


అయినప్పటికీ కాల్పులకు సంబంధించిన ఘటనపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై శాఖకు సమాచారం కూడా అందించామని పోలీసులు అన్నారు. మరోవైపు ఈ వీడియోపై సోషల్ మీడియా(social media)లో జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ అంశంపై మీరు ఎలా రియాక్ట్ అవుతారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం.. తీక్షణంగా పరిశీలించగా.. చివరకు..

Updated Date - Mar 03 , 2024 | 10:12 AM