Share News

Viral Video: బాబోయ్.. పాములను మార్కెట్లో ఇలా అమ్ముతున్నాడేంటి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN , Publish Date - Mar 30 , 2024 | 08:58 PM

సాధారణంగా రద్దీ మార్కెట్లలో, రోడ్లపై నిల్చునే కొందరు వ్యక్తులు తమ చేతులతో బ్యాగ్‌లు, బెల్ట్‌లు, బట్టలను పట్టుకుని అమ్ముతుంటారు. వారు పెద్దగా అరుస్తూ తమ వస్తువులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

Viral Video: బాబోయ్.. పాములను మార్కెట్లో ఇలా అమ్ముతున్నాడేంటి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

సాధారణంగా రద్దీ మార్కెట్లలో, రోడ్లపై నిల్చునే కొందరు వ్యక్తులు తమ చేతులతో బ్యాగ్‌లు, బెల్ట్‌లు, బట్టలను పట్టుకుని అమ్ముతుంటారు. వారు పెద్దగా అరుస్తూ తమ వస్తువులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే షాక్ కావాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలోని వ్యక్తి రద్దీ రోడ్డుపై నిల్చుని పాములను (Snakes) అమ్ముతున్నాడు. అతడి చేతికి పాములు వేలాడుతున్నాయి (Man selling Snakes).

ఫహద్ ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక వ్యక్తి డజన్ల కొద్దీ పాము పిల్లలను పట్టుకుని మార్కెట్లో నిలబడి ఉన్నాడు. అతడు ఆ పాములను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను రెండు చేతులతో రెండు చిన్న పాములను పట్టుకున్నాడు. ``పాములు.. పాములు..`` అంటూ కేకలు వేస్తున్నాడు. అతడు పాములు అమ్ముతున్నా అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఏదో పళ్లు, ఇతర సాధారణ వస్తువులు అమ్ముతున్నట్టుగా భావించి పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 5.7 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇదెలా సాధ్యం.. ఈ వీడియో నిజమైనదేనా``, ``ఇది రీల్స్ కోసం క్రియేట్ చేసిన వీడియోలా ఉంది``, ``మన దేశంలో ఇలాంటివి నిషేధం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పులికి దొరికిపోయిన జింక.. శరీరాన్ని ఒడ్డుకు ఎలా ఈడ్చుకెళుతోందో చూడండి.. వీడియో వైరల్!

Weight Loss: రెండేళ్లలో ఏకంగా 70 కిలోలు తగ్గిన కంపెనీ సీఈవో.. అతడి వెయిట్ లాస్ జర్నీ గురించి తెలిస్తే..

Updated Date - Mar 30 , 2024 | 08:58 PM