Share News

Viral Video: పులికి దొరికిపోయిన జింక.. శరీరాన్ని ఒడ్డుకు ఎలా ఈడ్చుకెళుతోందో చూడండి.. వీడియో వైరల్!

ABN , Publish Date - Mar 30 , 2024 | 06:44 PM

వన్య ప్రాణులకు సంబంధించిన హంటింగ్ వీడియోలు చాలా మందికి నచ్చుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పులికి దొరికిపోయిన జింక.. శరీరాన్ని ఒడ్డుకు ఎలా ఈడ్చుకెళుతోందో చూడండి.. వీడియో వైరల్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన హంటింగ్ వీడియోలు (Hunting Videos) చాలా మందికి నచ్చుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ జింకను (Deer) పులి (Tiger) వేటాడింది. మడుగులోకి దూకి ఆ జింకను పట్టుకుని తన పంజా దెబ్బ రుచి చూపించింది. చివరకు ఆ పులి చేతిలో జింక ప్రాణాలు కోల్పోయింది. మడుగులో ఉన్న జింక శరీరాన్ని పులి ఈడ్చుకుంటే ఒడ్డు పైకి తీసుకొచ్చింది. రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జంగిల్ టూర్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ranthambhorepark అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సఫారీ టూర్‌కు వెళ్లిన యాత్రికులు ఎందుకు కేకలు వేస్తారు``, ``ఇది ప్రకృతిలోని అద్భుతం``, ``ఆ జింక టైమ్ బాగోలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Weight Loss: రెండేళ్లలో ఏకంగా 70 కిలోలు తగ్గిన కంపెనీ సీఈవో.. అతడి వెయిట్ లాస్ జర్నీ గురించి తెలిస్తే..

Harsh Goenka: ఆరోగ్యకర జీవితం కోసం మూడు సింపుల్ టిప్స్.. డాక్టర్ వీడియోను షేర్ చేసిన హర్ష్ గోయెంకా!

Updated Date - Mar 30 , 2024 | 06:44 PM