Share News

Weight Loss: రెండేళ్లలో ఏకంగా 70 కిలోలు తగ్గిన కంపెనీ సీఈవో.. అతడి వెయిట్ లాస్ జర్నీ గురించి తెలిస్తే..

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:04 PM

అధిక బరువు ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. అనారోగ్యం కారణంగానో, ఫిట్‌గా ఉండాలనే కోరికతోనో చాలా మంది ఇటీవలి కాలంలో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.

Weight Loss: రెండేళ్లలో ఏకంగా 70 కిలోలు తగ్గిన కంపెనీ సీఈవో.. అతడి వెయిట్ లాస్ జర్నీ గురించి తెలిస్తే..

అధిక బరువు (Over Weight) ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. అనారోగ్యం కారణంగానో, ఫిట్‌గా ఉండాలనే కోరికతోనో చాలా మంది ఇటీవలి కాలంలో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారిస్తున్నారు (Weight Loss). కఠినమైన డైట్, వ్యాయామం వంటివి చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితాలు రాలేదని కొందరు, ఎక్కువ కాలం కొనసాగించలేక కొందరు మధ్యలోనే వదిలేస్తుంటారు. అలాంటి ఎంతో మంది ఆరంభ శూరులు కచ్చితంగా హౌసింగ్ డాట్ కామ్ (Housing.com) సీఈవో ధ్రువ్ అగర్వాల్ (Dhruv Agarwal) జర్నీని స్ఫూర్తిగా తీసుకోవాలి (Weight-Loss Journey).

ధ్రువ్ అగర్వాల్ రెండేళ్లలో ఏకంగా 71 కిలోల బరువు తగ్గారు. సింగపూర్‌లో వ్యాపార కార్యకలపాలు సాగిస్తున్న ఆయన 2021లో భారత్‌కు వచ్చినపుడు ఛాతి నొప్పితో బాధపడ్డారు. గుండె మంట కారణంగా ఆ నొప్పి వచ్చిందని తెలుసుకున్నారు. అప్పటికి ఆయన బరువు 151 కిలోలు. అప్పటికే ఆయనకు డయాబెటిస్, అధిక కొలస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు ఉన్నాయి. దాంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వ్యాయామం, డైటింగ్ మొదలుపెట్టారు. టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఫిట్‌నెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారు.

ఫిట్‌నెస్ నిపుణుడిని ఏర్పాటు చేసుకుని రోజుకు రెండు సార్లు అతడి పర్యవేక్షణలో వర్కవుట్లు చేసేవారు. రోజుకు దాదాపు 1700 క్యాలరీలు కరిగించడంపై దృష్టి పెట్టారు. వారంలో మూడు రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ సెషన్‌లలో పాల్గొనేవారు. అలాగే వాకింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటివి చేసేవారు.

నోటిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నారు. అనారోగ్యకర ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం మానేశారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, కూరగాయలు తీసుకునేవారు. రాత్రి కాల్చిన చికెన్ లేదా చేపలు తినేవారు. అలాగే గుమ్మిడి గింజలు, అవిసె గింజలు, క్యారెట్లు, దోసకాయలు వంటి అరోగ్యకర స్నాక్స్ తీసుకునేవారు.

దాదాపు రెండేళ్ల పాటు అకుంఠిత దీక్షతో వ్యాయామం, డైటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఫలితంగా 151 కిలోల నుంచి 80 కేజీలకు వచ్చేశారు. తనను దీర్ఘకాలం వేధించిన స్లీప్ ఆప్నియా, రక్తపోటు వంటి సమస్యలు దూరమయ్యాయని ధ్రువ్ అగర్వాల్ ఎంతో సంతోషంగా తెలిపారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి!.. ఈ ఫొటోలో బ్రష్ ఎక్కడుందో 12 సెకెన్లలో కనిపెట్టండి..!

PAN Card: కాలేజ్ విద్యార్థికి షాక్! రూ.46 కోట్ల ఇన్‌కమ్‌ట్యాక్స్ నోటీస్ రావడంతో అవాక్కు.. అసలు కథేంటంటే..

Updated Date - Mar 30 , 2024 | 05:05 PM