Share News

PAN Card: కాలేజ్ విద్యార్థికి షాక్! రూ.46 కోట్ల ఇన్‌కమ్‌ట్యాక్స్ నోటీస్ రావడంతో అవాక్కు.. అసలు కథేంటంటే..

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:40 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ విద్యార్థికి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. ఏకంగా రూ.46 కోట్ల నోటీస్ పంపించింది.

PAN Card: కాలేజ్ విద్యార్థికి షాక్! రూ.46 కోట్ల ఇన్‌కమ్‌ట్యాక్స్ నోటీస్ రావడంతో అవాక్కు.. అసలు కథేంటంటే..

మధ్యప్రదేశ్‌ (Madhyapradesh)లోని గ్వాలియర్‌కు చెందిన ఓ విద్యార్థికి (Student) ఇన్‌కమ్ ట్యాక్స్ (Income tax) డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. ఏకంగా రూ.46 కోట్ల నోటీస్ (IT Notice) పంపించింది. ఓ సాధారణ విద్యార్థి అయిన తనకు అంత ట్యాక్స్ నోటీస్ రావడంతో ఆ కుర్రాడు షాకయ్యాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆ కుర్రాడి పాన్ కార్డును (PAN Card) కొందరు దుర్వినియోగం చేసినట్టు విచారణలో బయటపడింది. అందువల్లే అతడికి ఐటీ నోటీస్ వచ్చింది.

గ్వాలియర్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే యువకుడి బ్యాంకు ఖాతా నుంచి అతడికి తెలియకుండా రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. అతడి పాన్ కార్డును ఉపయోగించి ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఓ కంపెనీని 2021లో ప్రారంభించారు. ఆ పాన్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపారు. దీంతో ఐటీ, జీఎస్టీ విభాగాల నుంచి ప్రమోద్ కుమార్‌కు నోటీసులు వచ్చాయి. దీంతో అవాక్కైన ప్రమోద్ కుమార్ అసలు విషయం తెలుసుకుని షాకయ్యాడు. తనకు తెలియకుండానే ఇదంతా జరిగిందని చెబుతున్నాడు.

ఆదాయపు శాఖ నుంచి నోటీస్ వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు. తన పాన్ కార్డు దుర్వినియోగం అయినట్టు తెలుసుకుని వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో శుక్రవారం ఏఎస్పీ ఆఫీస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్టు ఏఎస్పీ తెలిపారు.

Updated Date - Mar 30 , 2024 | 04:40 PM