Share News

Telangana Budget Live Updates: బాబోయ్.. తెలంగాణ బడ్జెట్‌లో ఇన్ని శుభవార్తలా.. ఆలస్యమెందుకు చెక్ చేసుకోండి!

ABN , First Publish Date - Feb 10 , 2024 | 11:58 AM

Telangana Budget Session: తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో తన ‘మార్కు’ను చూపించారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం.. రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో రేవంత్ సర్కార్ తొలి పద్దును ప్రతిపాదించింది. శాసనసభలో భట్టి.. మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు..

Telangana Budget Live Updates: బాబోయ్.. తెలంగాణ బడ్జెట్‌లో ఇన్ని శుభవార్తలా.. ఆలస్యమెందుకు చెక్ చేసుకోండి!

Live News & Update

 • 2024-02-10T14:56:57+05:30

  రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు నగలు వేసుకోవట్లేదా?: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

  • గత ప్రభుత్వం ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ అన్నారు.

  • వెయ్యేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సాంస్కృతిక చిహ్నాలను మారుస్తామని.. సంస్కృతిని అవమానపరుస్తున్నారు.

  • చార్మినార్, కాకతీయ తోరణం తెలంగాణ వారసత్వ చిహ్నాలు.

  • మన రాజ ముద్రలో మూడు సింహాలు ఉంటాయి.

  • అయితే వాటిని తొలగిస్తావా?

  • నిజాం రాజు కూర్చున్న చైర్‌లో మీరు సీఎంగా కూర్చున్నారు మీ చైర్‌ను వదిలివెస్తారా?

  • కేసీఆర్ మిషన్ కాకతీయ చెరువులు పూడిక తీశారు. ఇప్పుడు మళ్లీ చెరువులు మళ్ళీ పుడ్చుతారా?

  • కాకతీయ తోరణం, చార్మినార్‌ను తీసివేస్తే వీరుల తెలంగాణ చరిత్రను అవమానించినట్లే.

  • తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే తప్పేంటి. దేవత లాగా ఉండడానికి కిరీటం పెట్టారు.

  • తెలంగాణ వాళ్ళు నగలు పేట్టుకొరని అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది.

  • రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఫంక్షన్లకు వెళితే నగలు వేసుకుని వెళుతున్నారు కదా.

  • అందెశ్రీ పాటలో కాకతీయ తోరణం, చార్మినార్, గోల్కొండ కోట, రుద్రమదేవి లాంటి వాళ్ళ చరిత్ర ఉంది. అలా అని అందే శ్రీ పాటలో ఉన్న పదాలను తొలగిస్తారా?

  • కాకతీయ తోరణం, చార్మినార్ తీసివేస్తే జనాలు హార్ట్ అవుతారు.

  • సీఎంగా ఎవరు ఉంటే వాళ్ళ కీర్తి అందులో కనపడుతుంది. సెక్రటేరియట్ కేసీఆర్ కట్టాడు అంటారా? లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది అంటారా? అంటే సెక్రటేరియట్‌ను మార్చేస్తారా?

 • 2024-02-10T14:55:08+05:30

  బీసీలకు బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేవు: ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

 • 2024-02-10T14:53:00+05:30

  మహిళలకు కేటాయింపులేవి: సత్యవతి రాథోడ్

  • బడ్జెట్‌పై ఆశతో ఉన్నాం. కానీ నిరాశ మిగిల్చింది.

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హమిలకు బడ్జెట్ కేటాయింపులు పెద్దగా లేవు.

  • ప్రజా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందిస్తే బాగుండేది.

  • మహిళలకు బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేవు.

 • 2024-02-10T14:46:01+05:30

  నేమ్ చెంజింగ్ ప్రభుత్వం మాత్రమే.. గేమ్ చెంజింగ్ ప్రభుత్వం కాదు: ఎమ్మెల్సీ కవిత

  • బడ్జెట్ లో విధివిధానాలలు ఉంటాయని అనుకున్నాం. కానీ లేవు.

  • మైనార్టీ సంక్షేమానికి రూ. 2000 కోట్లు కేటాయించారు.

  • కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా బడ్జెట్ కేటాయించలేదు

  • పేర్ల మార్పు మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు.

  • కాంగ్రెస్ ప్రభుత్వం నేమ్ చెంజింగ్ ప్రభుత్వం మాత్రమే.. గేమ్ చెంజింగ్ ప్రభుత్వం కాదు.

  • కళ్యాణ లక్ష్మీ నిధుల గురించి బడ్జెట్‌లో మెన్షన్ చేయలేదు.

  • గత ప్రభుత్వాలను విమర్శ చేయడానికి మాత్రమే బడ్జెట్ సమవేశాలు పెట్టారు.

 • 2024-02-10T14:43:40+05:30

  గత ప్రభుత్వంలో జిమ్మిక్కులు బడ్జెట్ ఉండేది: యెన్నం శ్రీనివాసరెడ్డి

  • గత ప్రభుత్వంలో జిమ్మిక్కులు బడ్జెట్ ఉండేది.

  • గత పది సంవత్సరాలుగా ఉన్న బడ్జెట్‌ను నిజా నిజాలతో పటాపంచలు చేశారు.

  • గతంలో గురుకులాలకు సొంత భవనాలు లేవు.

  • గత ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించారు.

  • డబుల్ బెడ్రూం అని మోసం చేశారు.

  • ప్రజాపాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

  • కాంట్రాక్ట్ ల పేరుతో ప్రజల ధనం దోచుకున్నారు.

  • అవసరానికి తగ్గ బడ్జెట్ పెట్టాము. దుభారా చెయ్యం.

  • మూసి ప్రక్షాళన విషయంలో గతంలో మాయ మాటలు చెప్పారు.

  • నిజాయితీతో, వాస్తవానికి దగ్గరగా ఉన్న బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్‌కి ధన్యవాదాలు.

 • 2024-02-10T14:39:10+05:30

  శాసనమండలి వాయిదా

  సోమవారం ఉదయం 10గంలకు శాసనమండలి సమావేశాలు వాయిదా వేశారు.

 • 2024-02-10T13:45:00+05:30

  బడ్జెట్‌పై బండి ఏమన్నారంటే..?

  • ఇచ్చిన హామీలకు కేటాయించిన బడ్జెట్‌కు పొంతన లేదు

  • కాంగ్రెస్ పూర్తిగా చేతులు ఎత్తేసింది

  • రైతులకు నిధులు కేటాయించలేదు

  • రూ. 53 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు..?

  • కాంగ్రెస్ హామీలు నెరవేరాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలి.. రూ. 53 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయి..?

  • బీసీలకు 20 వేల కోట్లు ఎక్కడ..? : బండి సంజయ్

  • ప్రజాహిత యాత్ర ప్రారంభించిన బండి

  • రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర

  • కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నాక యాత్ర ప్రారంభం

  • యాత్రలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌పై స్పందించిన బండి

  Bandi-Sanjay-Yatra.jpg

 • 2024-02-10T13:28:04+05:30

  వాయిదా.. మళ్లీ మండే కలుద్దాం..!

  • బడ్జెట్ ప్రసంగం అనంతరం సోమవారానికి శాసన సభ వాయిదా

  • శాసనమండలి కూడా వాయిదా

  • సోమవారం ఉదయం 10గంటలకు సమావేశాలు ప్రారంభం

  Telangana-Speaker.jpg

 • 2024-02-10T13:22:00+05:30

  తగ్గేదేలే.. విచారణ చేపడుతాం..!

  • కాళేశ్వరం, మేడిగడ్డ అవినీతిపై విచారణ చేపడుతాం

  • కృష్ణా జలాలపై రాజీలేని పోరాటం చేస్తాం

  • పదేళ్ల తప్పిదాలే నీటిపారుదల శాఖకు అవరోధాలు

  • గత పాలకులు ఖజానాను దివాలా తీయించారు

  • ప్రణాళిక, హేతుబద్ధత లేని అప్పులు సవాళ్లుగా మారాయి

  • నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు

  • డ్రగ్స్‌ వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నాం

  • శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం భట్టి

  Budget-Batti.jpg

 • 2024-02-10T13:15:00+05:30

  గృహ నిర్మాణ శాఖ కోసం ఇలా..

  • ఈ బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ. 7,740 కోట్లు

  • గత సర్కార్ పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లను మోసం చేసింది

  • కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం

  • ఇళ్లు లేనివారికి ఇండ్లు, స్థలం ఉంటే.. నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం

  • కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నాం

  • ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టీ

 • 2024-02-10T13:00:20+05:30

  బడ్జెట్‌లో విద్యారంగం కోసం ఇలా..!

  • ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్‌షిప్‌లను సకాలంలో అందజేస్తాం

  • తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం..

  • ఇందుకు రూ. 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం

  • ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తెస్తాం

  • వందశాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు

  • స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ఆలోచన

  • గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రల్లో అధ్యయనానికి అధికారుల బృందం.

  • ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు

  • విద్యారంగానికి ఈ బడ్జెట్‌‌లో రూ. 21,389 కోట్లు

 • 2024-02-10T12:55:22+05:30

  అన్నీ శుభవార్తలే..!

  • బీసీ సంక్షేమం రూ. 8 వేల కోట్లు

  • బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ. 1546 కోట్లు.

  • విద్యా రంగానికి రూ. 21389కోట్లు.

  • తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు.

  • యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు

  • వైద్య రంగానికి రూ. 11500 కోట్లు

  • విద్యుత్ - గృహ జ్యోతికి రూ. 2418 కోట్లు.

  • విద్యుత్ సంస్థలకు రూ. 16825 కోట్లు.

  • నీటి పారుదల శాఖకు రూ. 28024 కోట్లు

  • గృహ నిర్మాణానికి రూ. 7740 కోట్లు

 • 2024-02-10T12:48:20+05:30

  మూసీ సుందరీకరణకు వెయ్యి కోట్లు!

  • మూసీ సుందరీకరణ, అభివృద్ధికి 1000 కోట్ల బడ్జెట్

  • మూసి రివర్ ఫ్రంట్ అబ్బివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్

  • లండన్ థెమ్స్ నదిలా మూసీ నది అభివృద్ధి

  • పాదాచారుల జోన్ లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు,

  • పర్యావరణ పద్దతిలో మూసి డెవలప్మెంట్

 • 2024-02-10T12:45:04+05:30

  TSPSCకి బడ్జెట్‌లో రూ. 40 కోట్లకు కేటాయింపు

  • యువకులను రెచ్చగొట్టడం కాదు, అక్కున చేర్చుకుంటాం

  • వారికీ ఆసరాగా ఉంటాం.. ఆదుకుంటాం

  • జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తాం

  • త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుంది

  • త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం

  • గ్రూప్ -1 లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నాం

  • గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ గ్రూప్ -1 ఉద్యోగాలను ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టీ

 • 2024-02-10T12:35:50+05:30

  రైతన్నలకు రేవంత్ సర్కార్ తియ్యటి శుభవార్త

  • రైతు రుణమాఫీపై బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది.. అందుకే రైతు రుణమాఫీ అంశాన్నీ ఎన్నికల ప్రణాళికలో పెట్టాం

  • ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే రుణమాఫీ చేయబోతున్నాం

  • రూ. 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందిస్తున్నాం

  • విధివిధానాలు తయారు చేస్తున్నాం..

  • ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం : భట్టి విక్రమార్క

 • 2024-02-10T12:30:17+05:30

  ఏయే శాఖకు ఎన్ని కోట్లు..?

  • పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు

  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు

  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు

  • త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ

  • పురపాలక శాఖ రూ.11,692 కోట్లు

  • వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు

  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు రూ.1,000 కోట్లు

  • రైతులకు ఎకరాకు రూ.15,000 రైతు భరోసా: డిప్యూటీ సీఎం భట్టి

  • కౌలు రైతులకు రైతు భరోసా సాయంపై మార్గదర్శకాలు

  • ఎస్సీ సంక్షేమం రూ.21,874 కోట్లు

  • ఎస్టీ సంక్షేమం రూ.13,313 కోట్లు

  • మైనార్టీ సంక్షేమం రూ.2,262 కోట్లు

  • వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు

  • ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకు రూ.1,000 కోట్లు

  • ఎస్టీ గురుకులాల భవనాల నిర్మాణాలకు రూ.250 కోట్లు

  • బీసీ గురుకులాల స్వంత భవనాల నిర్మాణాలకు రూ.1,546 కోట్లు

  • బీసి సంక్షేమం రూ.8,000 కోట్లు

  • విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు

  • విద్యా రంగం రూ.21,383 కోట్లు

  • విద్యుత్ - గృహ జ్యోతికి రూ.2,418కోట్లు

  • విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు

  • నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు

  • గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు

  Vikramarka.jpg

 • 2024-02-10T12:25:22+05:30

  మాటిచ్చి.. నిలబెట్టుకున్న రేవంత్

  • 6 గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు కేటాయింపు

  • సంక్షేమం, అభివృద్ది ప్రధాన ధ్యేయంగా బడ్జెట్

  • బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని ముందే చెప్పిన సీఎం రేవంత్

  • విద్య, వైద్యం, వ్యవసాయ శాఖలకు భారీగా నిధులు కేటాయించిన రేవంత్‌ సర్కార్‌

  • 2023 -24 తలసరి ఆదాయం రూ. 3,09,912

 • 2024-02-10T12:15:33+05:30

  ఇదీ తొలి బడ్జెట్ లెక్క..

  • అసెంబ్లీలో తెలంగాణ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌

  • బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • మండలిలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

  • రూ.2.90 లక్షల కోట్లతో తెలంగాణ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌

  • తెలంగాణ 2024-25 బడ్జెట్‌ రూ.2,75,891 కోట్లు

  • రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు

  • మూలధన వ్యయం రూ.29,669 కోట్లు

 • 2024-02-10T12:10:11+05:30

  అటు భట్టి.. ఇటు శ్రీధర్!

  • తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభం

  • కాసేపట్లో మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

  • శాసనభలో బడ్జెట్ గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

   Bhatti-Budget.jpg

 • 2024-02-10T12:05:10+05:30

  రెడీ.. వన్.. టూ.. త్రీ

  • అసెంబ్లీలో తెలంగాణ ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌

  • బడ్జెట్‌ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  TG-Assembly.jpg

 • 2024-02-10T12:00:38+05:30

  ఎన్ని కోట్లు ఉండొచ్చు..?

  ఇవాళ ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరిగింది. 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ బడ్జెట్‌ రూ. 2.75 లక్షల కోట్లు అని తెలుస్తోంది.

 • 2024-02-10T11:45:00+05:30

  Telangana Budget Live Updates.jpg

  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌ను శనివారం నాడు (ఫిబ్రవరి-10న) ప్రవేశపెడుతోంది. సంక్షేమం- అభివృద్దే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్‌ను రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా.. బడ్జెట్‌లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత లభించనుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించనుంది. గొప్పలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలకు మేలు చేకూరేలా బడ్జెట్ ఉంటుందని అధికార పార్టీ చెబుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కల్వకుంట్ల తారకరామారావు బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. మరోవైపు కేసీఆర్.. ఇవాళ్టి సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియవచ్చింది. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే.. ఈ సమావేశాలకు కేటీఆర్ దూరంగా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ ఉండటంతో.. ఈ సభకు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకాబోతున్నారు. దీంతో సమావేశాలకు రావట్లేదని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారనే వార్తలతో అలర్టయిన కేటీఆర్.. ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే.. కార్పొరేటర్లను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చే పనిలో కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ఉన్నారు.