Share News

AP Election 2024: ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో అభ్యర్థిని మార్చిన టీడీపీ

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:56 PM

ఒంగోలు పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. తొలుత ఈ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది.

AP Election 2024: ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో అభ్యర్థిని మార్చిన టీడీపీ

ప్రకాశం: ఒంగోలు పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని టీడీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. తొలుత ఈ సీటును మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఆ పార్టీ తాజాగా వ్యూహం మారింది. సీనియర్ నాయకుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేయడం ఖాయమైంది.


కాగా వచ్చే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలను ఏమాత్రం వదులుకోకూడదని టీడీపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా పొత్తులకు కూడా ఆ పార్టీ వెనుకడుగు వేయలేదు. బీజేపీ సారధ్యంలోని ఎన్‌డీఏలో చేరింది. మరోవైపు ప్రచారంలోనూ ఆ టీడీపీ దూసుకెళ్తోంది.

ఇవి కూాడా చదవండి

AP Election 2024: ఒంగోలు పార్లమెంట్‌ స్థానంలో అభ్యర్థిని మార్చిన టీడీపీ

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే కక్ష రాజకీయాలతో ఎదగలేకపోతున్నా.. వైసీపీకి షాక్ ఇచ్చిన నేత

మరిన్ని రాజకీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 08:10 PM