Share News

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

ABN , Publish Date - Feb 27 , 2024 | 07:25 PM

నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణరాజు పేరు వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

AP Politics: నర్సాపురం పార్లమెంట్‌ స్థానంలో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ!

అమరావతి: సంచలనాత్మక రీతిలో ఏకంగా 94 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి.. అధికార వైఎస్సార్‌సీపీ సహా రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) మిగిలిన స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. జనసేన పార్టీతో (Janasena) కలిసి ఎన్నికల బరిలో దిగుతున్నందున సమన్వయంతో, వ్యూహాత్మంగా టీడీపీ అడుగులు వేస్తోంది. టికెట్లకు పోటీ నెలకొన్న నేపథ్యంలో అసంతృప్తులతో సంప్రదింపులు జరుకుంటూ ముందుకెళ్తోంది. ఈ మేరకు టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో మరో ముఖ్యమైన సీటు నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి విషయంలో క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది.

నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో క్లారిటీ కోసం తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది. ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణరాజు పేరు వినిపిస్తోంది. నర్సాపురం నుంచి రఘురామ ‘ఓకే అయితే 1 నొక్కండి’ అని వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిజానికి రఘురామ బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలో ఆయన పేరు వినిపిస్తుండడంతో టీడీపీ అభ్యర్థి ఆయనే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Untitled-5.jpg

కాగా ఇటీవల మొదటి జాబితా విడుదల సందర్బంగా మాట్లాడుతూ.. సర్వే ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సర్వే అనంతరమే ప్రకటన చేసినట్టు వివరించారు. ఇప్పటివరకు ఎమ్మెల్యే అభ్యర్థుల కోసమే సర్వే చేయించగా తాజాగా ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం కూడా సర్వే మొదలైంది. ఐవీఆర్ఎస్ సర్వేలో చంద్రబాబు స్వరంతో అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 07:31 PM