Share News

AP Elections 2024: ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే.. ఇది చూశాక వైఎస్ జగన్ ముఖచిత్రమేంటో..?

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:47 PM

Pioneer Poll Strategies Survey: వై నాట్ 175 (Why Not 175).. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సిందే..! ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే..! ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సరే.. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. గెలిచి తీరుతాం..! ఇవీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. ఏ సభలో ప్రసంగించినా మొదట వచ్చే మాటలు. సభలకు జనాలు వస్తున్నారు.. జగన్ కూడా బటన్ మీద బటన్‌లు నొక్కేస్తున్నారు.. అంతేకాదు.. ఏలూరు సిద్ధం సభావేదికగా ఎన్నిసార్లు బటన్ నొక్కారని లెక్కలతో సహా కూడా చెప్పారు జగన్. అయితే.. గ్రౌండ్ లెవల్‌లో మాత్రం సీన్ మొత్తం రివర్స్‌గా ఉంది...

AP Elections 2024: ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే.. ఇది చూశాక వైఎస్ జగన్ ముఖచిత్రమేంటో..?

వై నాట్ 175 (Why Not 175).. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సిందే..! ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే..! ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సరే.. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. గెలిచి తీరుతాం..! ఇవీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. ఏ సభలో ప్రసంగించినా మొదట వచ్చే మాటలు. సభలకు జనాలు వస్తున్నారు.. జగన్ కూడా బటన్ మీద బటన్‌లు నొక్కేస్తున్నారు.. అంతేకాదు.. ఏలూరు సిద్ధం సభావేదికగా ఎన్నిసార్లు బటన్ నొక్కారని లెక్కలతో సహా కూడా చెప్పారు జగన్. అయితే.. గ్రౌండ్ లెవల్‌లో మాత్రం సీన్ మొత్తం రివర్స్‌గా ఉంది. ప్రజల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉండటంతో భారీగా అభ్యర్థులను మారుస్తున్నప్పటికీ పరిస్థితులు వైఎస్ జగన్‌కు ఏ మాత్రం అనుకూలంగా లేవని సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. వ్యవస్థలను సర్వ నాశనం చేసి ఏ మాత్రం అభివృద్ధి చూపించలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంతేకాదు.. విద్య, వైద్య ఇలా ఏ రంగంలోనూ సరైన అభివృద్ధి నోచుకోవట్లేదని సర్వేల్లో తేటతెల్లమైంది. ఇవన్నీ వైసీపీకి మైనస్‌గా మారబోతున్నాయని.. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ జగన్ గెలవరని సర్వేలు చెబుతున్నాయి.


ఇదీ అసలు లెక్క..!

వాస్తవానికి ఇప్పటికే పలు ప్రముఖ సర్వే సంస్థలు టీడీపీ-జనసేన కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ, ఎన్ని పార్లమెంట్ స్థానాల్లో కూటమి గెలుస్తుందని లెక్కలతో సహా చెప్పేశాయి. తాజాగా.. ప్రముఖ సర్వే సంస్థ ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం వై నాట్ 175 అంటున్న వైసీపీకి కేవలం 35 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. ఇక టీడీపీ-జనసేన కూటమికి 95 నుంచి 100 వరకూ వస్తాయని.. అధికారం కూటమిదేనని సర్వే సంస్థ తేల్చింది. ఇక వైసీపీకి 45%, టీడీపీ-జనసేన కూటమికి 52%, ఇతరులు 3 శాతం ఓట్ షేర్‌ ఉంటుందని పయనీర్ తేల్చింది. సో.. చూశారుగా ఈ సంస్థ కూడా టీడీపీ-జనసేన కూటమిదే అధికారమని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ సర్వేతో వైసీపీలో వణుకు మొదలైందట. మళ్లీ అధికారం, వైనాట్ 175 అనుకుంటుంటే సర్వేలో ఇలా వచ్చిందేంటి..? అని వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ఈ సర్వే విషయం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టికి రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారట. ఎక్కడ చూసినా.. ఎప్పుడు చూసినా వైనాట్ 175 అనే జగన్.. ఈ సర్వే నిశితంగా చూశాక ముఖచిత్రమేంటో అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, టీడీపీ-జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


పయనీర్ సర్వే ప్రకారం ఎక్కడ ఎన్ని సీట్లు..?

Master File HD_page-0026.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2024 | 06:27 PM