Share News

MLA Pinnelli: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?

ABN , Publish Date - May 29 , 2024 | 01:06 PM

6 హత్యలు.. 79 దాడులు.. దోపిడి 2 వేల కోట్లు..! ఇదీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పైశాచికం. ఇలా ఒక్కో అరాచకాన్ని వివరిస్తూ 23 పేజీల పుస్తకాన్ని ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) రిలీజ్ చేసింది. నిజంగా ఈ బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే..

MLA Pinnelli: పిన్నెల్లి పైశాచికం.. బ్రదర్స్ మాఫియాపై టీడీపీ బుక్ రిలీజ్.. ఇన్ని వేల కోట్ల ఆస్తులా..!?

6 హత్యలు.. 79 దాడులు.. దోపిడి 2 వేల కోట్లు..! ఇదీ మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) పైశాచికం. ఇలా ఒక్కో అరాచకాన్ని వివరిస్తూ 23 పేజీల పుస్తకాన్ని ‘పిన్నెల్లి పైశాచికం’ పేరిట టీడీపీ (TDP) రిలీజ్ చేసింది. నిజంగా ఈ బుక్‌ను నిశితంగా పరిశీలిస్తే.. తెలంగాణలో నయీం అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.. ఈయన ఆంధ్రా నయీం అన్న మాట. ఈ 23 పేజీల్లో ఒక్కో పేజీ ఒక్కో సంచలనమే. పిన్నెల్లి బ్రదర్స్ (Pinnelli Brothers) చేసిన.. చేస్తున్న అరాచకాలను కళ్లకు కట్టినట్లుగా ఉన్నాయి. పిన్నెల్లి నేర వారసత్వం మొదలుకుని.. హత్యాకాండ వరకూ అన్ని విషయాలూ పూసగుచ్చినట్లుగా టీడీపీ రాసుకొచ్చింది. దీంతోపాటు రూ. 2 లక్షల ఆదాయం నుంచి రూ. 2వేల కోట్లకుపైగా ఆస్తుల కూడబెట్టిన విధానం కూడా బుక్‌లో ఉంది. 2011-12లో పిన్నెల్లి ఆదాయం రూ. 1.95 లక్షలు.. నేడు అధికారికంగా రూ. 43 లక్షలు చూపిస్తున్నా అనధికారికంగా అది రూ. 200 కోట్లకు పైగానే ఉంది. అంతేకాదు.. అప్పులతో ఊరు వదిలి పారిపోయిన పరిస్థితి నుంచి అధికారం అడ్డుపెట్టుకుని వేలకోట్లకు పడగలెత్తారు. ఈ విషయాలన్నింటినీ పుస్తకంలో నిశితంగా వివరించింది టీడీపీ. మరీ ముఖ్యంగా.. 2019 నుంచి ఇప్పటి వరకూ టీడీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు, దాష్టీకాలను వివరించింది. దీంతోపాటు.. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి బ్రదర్స్ చేయించిన దాడులు 79 కాగా.. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై 51 దాడులు పేర్లతో సహా ఉన్నాయి.

పిన్నెల్లి పైశాచికం బుక్‌ కోసం క్లిక్ చేయండి


Pinnelli-Ramakrishna-Reddy.jpg

ఒకటా.. రెండా లెక్కలేనన్ని..!

ఎమ్మెల్యే పిన్నెల్లికి కానీ.. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినా..? టీడీపీ జెండా పట్టుకుని తిరిగినా దాడులు చేసిన సందర్భాలున్నాయంటే ఎంత బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేకమంది టీడీపీ కార్యకర్తలను నడిరోడ్డుపై నరికి చంపడం.. మరికొందర్ని పీక కోయడం లాంటివి చేసి పైశాచిక ఆనందం పొందారని బుక్‌లో టీడీపీ రాసుకొచ్చింది. ఆఖరికి టీడీపీ నేతలైన బొండా ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్న, పారా కిశోర్‌లపై హత్యాయత్నం కూడా పిన్నెల్లి బ్రదర్స్ పనే. ఆడ, మగ.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రత్యర్థి అయితే చాలు చంపేయడమే అన్నట్లుగా ప్రవర్తించారు. మాచర్ల మండలంలోని ఆత్మకూరు గ్రామంలో వందలాది దళిత కుటుంబాలు గ్రామం నుంచి బెదరించి తరిమేశారు పిన్నెల్లి బ్రదర్స్ అండ్‌కో. అయితే.. వారికి అండగా ఉండేందుకు, భరోసా ఇచ్చేందుకు టీడీపీ చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారు.


Pinelli-EVM.jpg

ఈవీఎంలు ధ్వంసం!

మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన కూడా పిన్నెల్లి ‘పైశాచికం’ బుక్‌లో ఉంది. ఆ మరుసటి రోజు.. పోలింగ్ బూత్‌లో అడ్డుకున్న నంబూరి శేషగిరిరావుపై తీవ్రంగా దాడి చేసిన వైసీపీ మూకలు దాడి చేశాయి. ఇక టీడీపీ నేతలు, కార్యకర్తలు.. టీడీపీ ఏజెంట్లే కాదు.. సామాన్యులపైనా పిన్నెల్లి బ్రదర్స్ ప్రతాపం చూపించారు. ఏ పార్టీతో సంబంధంలేని.. కూలి పనిచేస్తే కానీ పూటగడవని కుటుంబ సభ్యుడిపై పిన్నెల్లి అనుచరులు, వైసీపీ మూకలు దాడులకు తెగబడ్డారు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పదుల సంఖ్యలో ఘటనలు ఉన్నాయి. కాగా.. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రావడంతో అడ్రస్ లేకుండా పరారైన బ్రదర్స్ హైకోర్టును ఆశ్రయించి అటు తిరిగి.. ఇటు తిరిగి సొంత నియోజకవర్గానికి చేరుకున్నారు. చూశారుగా ఇదీ.. ఆంధ్రా నయీం పిన్నెల్లి మారణకాండ..!!

Updated Date - May 29 , 2024 | 01:28 PM