Share News

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

ABN , Publish Date - Feb 17 , 2024 | 04:24 PM

Etela Rajender Issue: తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్.

TG Politics: ఈటల నిజంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నారా.. పూర్తి వివరాలు ఇవిగో..!

తెలంగాణ ఉద్యమకారుడు, బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender).. కాషాయ కండువా తీసేసి కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకోబోతున్నారా..? అతి త్వరలోనే హస్తం గూటికి చేరుతారా..? పార్టీలో చేరిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేస్తారా..? అంటే ఇవన్నీ నిన్న, మొన్నటి వరకూ ఆయన అభిమానులు, అనుచరుల్లో మెదిలిన ప్రశ్నలు. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసున్న ఫొటో కూడా నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఇక ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.. పక్కాగా కండువా మార్చేస్తారని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయ్. దీంతో ఇందులో నిజానిజాలెంత.. ? అనేది తెలియక ఈటల వీరాభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం ఈటలకు తెలియడంతో ఎట్టకేలకు స్పందించి.. క్లారిటీ ఇచ్చుకున్నారు.


etela-rajender.jpg

అసలేం జరిగింది..?

రెండ్రోజలుగా.. కాంగ్రెస్ నాయకులతో ఈటల దోస్తీ..? కడుతున్నారు. త్వరలోనే పార్టీలో చేరబోతున్నారనే వార్తలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో రాజేందర్ హాట్ టాపిక్ అయ్యారు. పైగా ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ముఖ్యనేతలతో ఈటల రాజేందర్‌తో సమావేశం కావడం మరింత చర్చనీయాంశమైంది. సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు ఎన్నికల ముందు ‘కారు’ దిగి కాంగ్రెస్‌లో చేరారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇటీవలే తన కుటుంబ సభ్యులతో కలిసి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఈ ఇద్దరూ ఈటలతో భేటీ కావడంతో తప్పకుండా కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికేనని.. టాక్ నడిచింది. పైగా కరీంనగర్ నుంచి బీజేపీ తరఫున ఈటల ఎంపీగా పోటీచేయడానికి అధిష్టానం ఒప్పుకోవట్లేదనే ప్రచారం వచ్చిన సమయంలోనే.. ఈ భేటీ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పక్కాగా కాషాయం పార్టీ వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే.. కాంగ్రెస్ నేతలతో భేటీ ఎందుకు జరిగింది..? గత రెండ్రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత..? అనే విషయాలపై రాజేందర్ క్లియర్ కట్‌గా సమాధానమిచ్చారు.


Etela-With-Cong-Leaders.jpg

ఇదీ అసలు కథ..!

కాంగ్రెస్ నేతలతో భేటీ వార్తలను ఈటల రాజేందర్ ఖండించారు. ‘ఒక గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో కలిసి భోజనం చేశాను.. కావాలని ఆ ఫోటో పెట్టి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు’ అని ఆయన క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘ఇటీవల బీజేపీ కార్పోరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లాను. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు. ఈ సమయంలో వారితో కలిసి నేను భోజనం కూడా చేశాను. కానీ కాంగ్రెస్ నేతలతో నేను ప్రత్యేకంగా భేటీ కాలేదు. అంతేకాదు.. ఈ కార్యక్రమంలో అందరితో కలిసి మాట్లాడాను.. అందరితో కలిసి భోజనం చేశాను. కానీ ఫొటోపై దుష్ప్రచారం సరికాదు. మళ్లీ చెబుతున్నా.. నేను ఏ కాంగ్రెస్ నేతలతోనూ భేటీ కాలేదు.. నన్ను బద్నాం చేయాలని కొందరు చూస్తున్నారు అని రాజేందర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETELA.jpg

సరిగ్గా ఇదే టైమ్‌లోనే..!

వాస్తవానికి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీచేసిన ఈటల రెండు చోట్లా ఘోర ఓటమిని చవిచూశారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. గజ్వేల్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతిలో రాజేందర్ ఓడిపోయారు. అప్పట్నుంచి బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న దాఖలాల్లేవ్. పార్టీ పెద్దలతోనూ అంటీముంటున్నట్లే ఉంటూ వస్తున్నారు. పైగా మౌనం ఉంటుండటం.. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఈటల, కాంగ్రెస్ నేతలు కలిసున్న ఫొటో బయటికి రావడంతో ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై స్పందించిన ఈటల తీవ్రంగా ఖండించారు. చూశారుగా.. కాషాయ కండువా తీసి కాంగ్రెస్‌లో చేరుతున్నానన్న వార్తలను ఈటల రాజేందర్ పూర్తిగా ఖండించారు. ఈ క్లారిటీతో ఆయన అభిమానులు, అనుచరులు కాస్త రిలీఫ్ అయ్యారు.


ఇవి కూడా చదవండి


AP Elections 2024: వణికిపోతున్న సీఎం వైఎస్ జగన్.. బ్యాంకాక్, నేపాల్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు!


TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?


YS Jagan: జగన్.. ఇంగ్లీష్ రాదా.. ఏంటి..? ఎక్కడ చూసినా ఇదే చర్చ!


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 04:24 PM