Share News

AP Elections 2024: వణికిపోతున్న సీఎం వైఎస్ జగన్.. బ్యాంకాక్, నేపాల్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు!

ABN , Publish Date - Feb 11 , 2024 | 05:09 PM

Rajyasabha Elections: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ (YSR Congress) కుయుక్తులు పన్నుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) మిత్రపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి..

AP Elections 2024: వణికిపోతున్న సీఎం వైఎస్ జగన్.. బ్యాంకాక్, నేపాల్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ (YSR Congress) కుయుక్తులు పన్నుతుండగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) మిత్రపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అసంతృప్తి.. రగలడంతో అధికారపార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. వైసీపీ చేజేతులా చేస్తున్న తప్పులన్నీ టీడీపీకి (Telugudesam) ప్లస్ అవుతున్నాయ్.. కలిసొస్తున్నాయ్ కూడా. ఎందుకంటే.. సుమారు 58 మందికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 లోక్‌సభ (Loksabha) స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది వైసీపీ. దీంతో సిట్టింగుల్లో చాలా మందికి సీట్లు దక్కలేదు. వారంతా తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరిపోగా.. మరికొందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుని కూర్చున్నారు. ఇంకొందరు అయితే ఎన్నికల ముందు జంప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే రాజ్యసభ (Rajyasabha) ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది అధికార, ప్రతిపక్ష పార్టీలకు పెద్ద టాస్క్‌గా మారింది. మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో.. మూడూ గెలిచి తీరాల్సిందేనని వైసీపీ.. ఒక్క స్థానం అయినా దక్కించుకోవాలని టీడీపీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్‌కు పెద్ద చిక్కే వచ్చి పడింది.


YSRCP.jpg

ఏం జరుగుతోంది..?

నియోజకవర్గాలకు ఇంచార్జులను నియమించడంతో 30 మందికి పైగా సిట్టింగులకు సీట్లు కరువయ్యాయి. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. వారందరితోనూ ఇప్పుడు జగన్‌కు పనిపడింది. ఎమ్మెల్యేలను అసంతృప్తి నుంచి బయటికి తెస్తే తప్ప.. ఇప్పుడు మరో దారి లేకుండా పోయింది. మూడు స్థానాలను గెలవాలంటే తప్పకుండా అందరూ అందుబాటులో ఉండాల్సిందే.. ఓటేయాల్సిందే. అయితే.. ఇప్పుడున్న ఈ అసంతృప్త పరిస్థితుల్లో 30 మంది సిట్టింగులు వైసీపీకి అనుకూలంగా ఉంటారా లేదా అన్నది అధిష్టానానికి అగ్ని పరీక్షగా మారింది. టీడీపీకి 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండటంతో బరిలో ఉంటుందా..? లేదా..? అన్నది క్లారిటీ లేదు కానీ.. వైసీపీ మాత్రం మూడూ కొట్టాల్సిందేనని కూర్చుంది. అనుకోవడంలో తప్పులేదు కానీ.. ఎమ్మెల్యేలందర్నీ మేనేజ్ చేయడం వైఎస్ జగన్ (YS Jagan Reddy) వల్ల కావట్లేదట. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే చూసినా ఏదో ఒక విషయంలో అసంతృప్తితో రగిలిపోతుండటం.. ఉన్న ఎమ్మెల్యేలు కాస్త జగన్‌పై గుర్రుగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో మూడు సీట్ల కథ హుష్ కాకి అయ్యే ఛాన్స్ ఉందట. ఇదే జరిగితే ఎన్నికల ముందు సిట్టింగులు టీడీపీవైపు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువగా ఉంది.


CM-YS-Jagan.jpg

అవునా.. నిజమేనా..?

అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి వైఎస్ జగన్ ఓ ప్లాన్ చేశారని తెలియవచ్చింది. ‘ప్లీజ్.. ప్లీజ్ ఈ ఒక్కసారికి అయితే ఓటేయండి.. ఎన్నికల తర్వాత మిగిలినవి ఆలోచిద్దాం’ అని పలువురు ఎమ్మెల్యేలకు స్వయంగా జగన్ రెడ్డే కాల్ చేస్తున్నారట. అంతేకాదు.. సిట్టింగ్ అయ్యుండి.. టికెట్ ఇవ్వలేని పక్షంలో వారికి ప్రస్తుతానికి 10 నుంచి 15 కోట్ల రూపాయిల వరకూ నజరానాగా ఇస్తున్నారని తెలియవచ్చింది. అంతేకాదు.. వారందర్నీ బ్యాంకాక్, నేపాల్, గోవా.. హైదరాబాద్‌లోని (Hyderabad) పలు క్యాంప్‌లకు తరలిస్తున్నట్లుగా సమాచారం. అంటే.. వైసీపీ క్యాంప్ రాజకీయాలకు (YSRCP Camp Politics) పాల్పడుతోందన్న మాట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించగా.. మరికొందర్ని త్వరలోనే తరలిస్తారని తెలుస్తోంది. వీరిలో సిద్ధారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, అరణి శ్రీనివాసులు, ఆర్థర్, వరప్రసాద్, డాక్టర్ సుధాకర్, వేణుగోపాల్, బుర్రా మధుసూధన్ యాదవ్, సుధాకర్ బాబు, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, శెట్టి పాల్గుణతో పాటు పలువురు టికెట్లు దక్కని సిట్టింగులు ఉన్నారట. ఒకట్రెండు రోజుల్లో ఈ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించాలని హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. కాగా.. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో ముందు చూపుగా అధిష్టానం ఇలా చేస్తోందట. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

TG Politics: ఎంపీ టికెట్ రేసులో సీఎం రేవంత్ సోదరుడు.. కీలక నియోజకవర్గంపై కన్ను.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..?


YS Jagan: జగన్.. ఇంగ్లీష్ రాదా.. ఏంటి..? ఎక్కడ చూసినా ఇదే చర్చ!



Updated Date - Feb 11 , 2024 | 05:09 PM