Share News

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

ABN , Publish Date - Feb 22 , 2024 | 12:23 PM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే..

AP Politics: చీపురుపల్లిలో పోటీపై ఫస్ట్ టైమ్ స్పందించిన గంటా.. అంతా ఓకే కానీ..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అధికార వైసీపీ.. టీడీపీ-జనసేన (TDP-Janasena) మిత్రపక్షాలు నిమగ్నమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పలువురు సిట్టింగులు, కీలక నేతలకు టికెట్లు దక్కట్లేదు. టికెట్ దక్కిన వారికి సిట్టింగ్ సీటు దొరకట్లేదు. ఇక అసలు విషయానికొస్తే.. తాజా, మాజీ విద్యాశాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ- గంటా శ్రీనివాసరావుల (Ganta Sreenivasa Rao) మధ్య చీపురుపల్లిలో ఫైట్ జరగబోతోందని రెండ్రోజులుగా వార్తలు పెద్దఎత్తున సంగతి తెలిసిందే. దీనిపై రకరకాలుగా వార్తలు అంతకుమించి గాసిప్స్, పుకార్లు షికార్లు చేశాయి. పైగా ఈ పోటీ వ్యవహారంపై నిన్న, మొన్నటి వరకూ స్పందించిన గంటా తాజాగా స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.


Ganta-Srinivasa-Rao-1.jpg

నేను రె‘ఢీ’నే కానీ..?

చీపురుపల్లిలో పోటీపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేస్తూనే.. కాసింత అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. చీపురుపల్లిలో పోటీ చేయమని పార్టీ అధిష్టానం కోరిన మాట వాస్తమే. శ్రేయోభిలాషులు, సన్నిహితులతో మాట్లాడి ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాను. విజయనగరం నుంచి టీడీపీ నేతలు వచ్చి నన్ను కలుస్తున్నారు. గతంలో పోటీ చేసిన నియోజక వర్గంలో ఈసారీ పోటీ చేయాలని నేను అనుకున్నాను. మనస్సులో అయితే విశాఖలోనే ఉండాలని.. పోటీచేయాలని ఉంది. టీడీపీ-02 సీట్లు, జనసేన-02 సీట్లు అధికారంగా ప్రకటించారు. మిగిలిన సీట్లను ఇరువురు అధినేతలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు అని గంటా క్లారిటీ ఇచ్చుకున్నారు.

ganta-jagan.jpg

అబ్బే అంతంత మాత్రమే..!

‘ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం ఉమ్మడి విశాఖలో విజయవంతం అయింది. వైసీపీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని మంచి నీళ్ళులా ఖర్చు పెడుతోంది. సిద్దం సభలకు.. ఆర్టీసీ బస్సులు, మద్యం, డబ్బులు ఇచ్చి జనాన్ని తెప్పించుకుంటున్నారు. అయినా.. జగన్ సిద్ధం సభలకు వచ్చేది ప్రజలు అంతంత మాత్రమే. వైసీపీ మునిగిపోతున్న నావ.. ఘోర పరాజయం తప్పదు. అందుకే ఆ పార్టీని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుకున్నారు. వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపుతామని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తున్నాం. శారద పీఠానికి సీఎం జగన్ వచ్చినప్పుడు.. డ్వాక్రా మహిళలను, ప్రజలను ఇబ్బందులు పెట్టారు. సిఎం జగన్ విశాఖకు వస్తున్నారంటే ప్రజలు భయపడుతున్నారు. ఆకాశంలో సీఎం వెళ్ళినా.. నేలపై ట్రాఫిక్‌ను అపుతున్నారు. టీడీపీ- జనసేన కాంబినేషన్ సూపర్ డుపర్ హిట్ కానుంది. నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసమే. ఏపీలో దగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు’ అని వైసీపీపై గంటా కన్నెర్రజేశారు.


GANTA-SRINIVASA-RAO.jpg

ట్రాక్ రికార్డ్!

మొత్తానికి.. చీపురుపల్లిలో పోటీపై గంటా తన మనసులోని మాట అయితే చెప్పేశారు. వాస్తవానికి గంటా ఐదేళ్లకోసారి కొత్త నియోజకవర్గానికి వెళ్తుంటారు.. గెలిచి తిరిగొస్తుంటారు. అందుకే గంటాకు ఆల్ రౌండర్‌గా పేరుంది. అందుకే శ్రీనివాస్‌ ‘సరైనోడు’.. చీపురుపల్లిలో బొత్సపై పోటీచేయించాలన్నది అధిష్టానం ప్లాన్. టార్గెట్ బొత్సలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఇలా చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. గంటా చెప్పాల్సింది చెప్పేశారు.. ఇక అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో..? సన్నిహితులతో మాట్లాడిన తర్వాత గంటా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సిందే మరి.


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి


ఇవి కూడా చదవండి


YSRCP: గుడివాడ నుంచి కొడాలి నాని ఔట్.. తెరపైకి వైఎస్ వీరవిధేయుడు!


AP Elections 2024: మంత్రి అంబటికి టికెట్ లేనట్టే.. తమ్ముడి కోసం చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే..!?


Revanth Govt: భట్టీ కీలక ప్రకటన.. మహిళలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్


Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!


Updated Date - Feb 22 , 2024 | 12:33 PM