Share News

AP Elections 2024: తూర్పుగోదావరిలో మారిన సీన్.. ఎవరి కొంప ముంచేనో?

ABN , Publish Date - May 25 , 2024 | 01:05 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (AP Elections) రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అంతే స్పీడ్‌గా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మీదే బెట్టింగ్‌ సాగడం గమనార్హం..

AP Elections 2024: తూర్పుగోదావరిలో మారిన సీన్.. ఎవరి కొంప ముంచేనో?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై (AP Elections) రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అంతే స్పీడ్‌గా ఉన్నారు. ఎవరిష్టం వచ్చినట్టు వారు బెట్టింగ్‌లు కాస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల మీదే బెట్టింగ్‌ సాగడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థులను గాలి కొదిలేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు వచ్చే నెల 4న తేలనున్నాయి. ఈలోపు అభ్యర్థులంతా ఎవరి అంచనాల్లో వారున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 83 మంది పోటీపడ్డారు. వాస్తవానికి గెలుపు ఓటములు టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులు, వైసీపీ (YSR Congress) అభ్యర్థుల మధ్యే ఉంటుంది. కొంత వరకూ కాంగ్రెస్‌ (Congress) కూడా ప్రభావం చూపవచ్చు. కానీ జిల్లాలో ఎక్కువ మంది స్వతంత్రులు, వివిధ చిన్నాచితకా పార్టీల తరపున పోటీచేశారు. వారికి ఎన్ని ఓట్లు వచ్చినా ఎవరో ఒకరు ప్రధాన పార్టీ అభ్యర్థులకు నష్టమే.


TDP-JANASENA-BJP-PATH.jpg

దెబ్బ ఎవరికో..?

అసలు జిల్లాలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వస్తాయని.. అవి ఏ పార్టీని దెబ్బతీస్తాయనే పరిశీలన, అంచనాలు సాగుతున్నాయి. వాటితో పాటు నోటా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్‌, బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. నోటాకు 18,087 ఓట్లు లభించాయి. మరో ఆరుగురు స్వతంత్రులు పోటీ చేసినా వారందరికీ కలిపి 10 వేల లోపు మాత్ర మే ఓట్లు లభించాయి..ఈ సారి మొత్తం జిల్లాలో 83 మంది పోటీ చేస్తుంటే అందులో 59 మంది స్వతంత్రులు, చిన్నా చితకా పార్టీల వాళ్లే కావడం విశేషం. రాజమండ్రి లోక్‌సభ పరిధిలో 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పోటీ కూటమి అభ్యర్థి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గు బాటి పురందేశ్వరి, వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాసరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి గిడుగు రుద్ర రా జు మధ్యే ఉంటుంది. కానీ మరో 9 మంది బరిలో ఉన్నారు.


Kutami-Vs-YSRCP.jpg

గెలిచేదెవరు..?

బీఎస్పీ అభ్యర్థి పరమట గణేశ్వరరావు, నవరంగ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, రాష్ర్టీయ ప్రజాకాంగ్రెస్‌ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు, జైభారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి శింగులూరి మోహనరావు, స్వతంత్ర అభ్యర్థులు జల్లి బాలనవీన, బొమ్మనబోయిన వీ ఎస్‌ఆర్‌ మూర్తి, కురువెళ్ల భానుచందర్‌, డా.మె డిసి రత్నారావు అలియాస్‌ వినయ్‌, సోళోపం తుల రాఘవేంద్రరావు పోటీలో ఉన్నారు. వీరిలో కొందరు ఎన్నో కొన్ని ఓట్లు తెచ్చుకుంటారు. బొమ్మనబోయిన వీవీఎస్‌ఆర్‌ మూర్తి రిటైర్ట్‌ సీటీవో.ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజమండ్రి రూరల్‌లో నలుగురు, సిటీలో ఏడుగురు, నిడదవోలు బరిలో 9 మంది, కొవ్వూరులో 9 మంది ఉన్నారు.. గోపాలపురంలో 19 మంది ఉన్నారు.అనపర్తి బరిలో ఆరుగురు స్వతంత్రులు, ఇతర పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో పెద్దగా ప్రభావం చూపి గెలిచే వ్యక్తులు ఎవరూ లేరు. కానీ కొన్ని ఓట్లయినా చీలుస్తారు. అవి ఎవ రికో ఒకరికి నష్టం తెస్తాయి. ఈ అభ్యర్థులెవరూ నచ్చకపోతే నోటాకు వేసే వారు ఉంటారు. వారి వల్ల నష్టం ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థుల కులం, వారి హోదా, రాజకీయ పరిజ్ఞానం, వారు లేవనెత్తే సమస్యల వంటి వాటి ప్రభావం వల్ల కొన్ని ఓట్లు రాకమానవు. ఇందులో బీఎస్పీ వల్ల వైసీపీకే నష్టం ఉంటుందనే అంచనా ఉంది.

Updated Date - May 25 , 2024 | 01:06 PM