Share News

YSRCP: వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

ABN , Publish Date - May 27 , 2024 | 10:13 PM

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే.! ఆంధ్రప్రదేశ్ అడిషినల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) గుర్తున్నారుగా.. అవునులెండి ఈయన్ను ఎవరు మరిచిపోతారు..!. ఆ మధ్య టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పొన్నవోలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.! పేరుకే అడ్వకేట్ జనరల్ కానీ..

YSRCP: వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. గుక్కపట్టి ఏడ్చిన పొన్నవోలు!

అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే.! ఆంధ్రప్రదేశ్ అడిషినల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) గుర్తున్నారుగా.. అవునులెండి ఈయన్ను ఎవరు మరిచిపోతారు..!. ఆ మధ్య టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పొన్నవోలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.! పేరుకే అడ్వకేట్ జనరల్ కానీ.. చేసేదంతా జగన్నామ స్మరణేనని లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.! ప్రస్తుతం పొన్నవోలు లండన్ పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. టూర్‌లో భాగంగా వైసీపీ నేతలు, ముఖ్య కార్యకర్తలు, జగన్ వీరాభిమానులను కలుసుకున్నారు. అంతేకాదు.. కార్యకర్తల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు కూడా. ఈ సందర్భంగా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ గుక్కపట్టి ఏడ్చేశారు. ఇంతకీ ఏం జరిగింది..? పొన్నవోలు ఏం మాట్లాడారు..? అనే విషయాలను తెలుసుకుందాం వచ్చేయండి..!


Ponnavolu.jpg

ఇంతకీ వీడియోలో ఏముంది..?

వైఎస్ జగన్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థం చేసుకోండి. అసలు ఎవరిని నమ్మాలో తెలియట్లేదు (గుక్కపట్టి ఏడుస్తూ..). అసలు ఎవడు మనోడో.. ఎవడు పరాయి వాడో తెలియదు. అయినా సరే జగన్ మాత్రం ఏదైతే అదయ్యింది అనే ఉన్నాడు (మళ్లీ ఏడుస్తూ..). ఒక్క మనిషి ఫైట్ చేస్తున్నాడండి.. ఆయన కష్టం నాకు తెలుసు. అందుకే జగనన్నను కాపాడుకుందాం.. ఇదొక్కటే మనం చేయాల్సింది. మనల్ని జగన్ పలకరించాడా..? లేదా..? అన్నది వదిలేయండి.. వీలుపడని పరిస్థితిలో ఉన్నాడు. జస్ట్ అండర్ స్టాండ్. నాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఫీలింగ్ తెలుసు. అందరూ రండి.. మీరందరూ ఏపీకి రండి.. అందరం కలిసి పార్టీ చేసుకుందాం. ఒక్కరోజు మీటింగ్ పెట్టుకుందాం.. అందరం కలిసి భోజనం చేద్దాంఅని వైసీపీ వీరాభిమానులతో పొన్నవోలు ఏడుస్తూ, బాధపడుతూ.. తీవ్ర బావోద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడారో..? ఎందుకు ఇంతలా యాక్టింగ్ చేయాల్సి వచ్చిందో..? అయినా ఎన్నికల ముందు ఇలాంటి సెంటిమెంట్స్ పండేవి కదా.. ఎన్నికలు అయ్యాక ఇంకెందుకు..? అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. ఏపీలో ఎన్నికలయ్యాయి అంతేకానీ.. పొన్నవోలు డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందంటూ మరికొందరు సెటైర్లేస్తున్న పరిస్థితి. ఫలితాలకు ముందే వైసీపీ చేతులెత్తేసిందని.. పొన్నవోలు కామెంట్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ శ్రేణులు ఓ రేంజిలో విరుచుకుపడుతున్నాయి.


Ponnavolu-02.jpg

ఇదివరకే ఇలా..?

బాబోయ్.. ఇదొక్కటే కాదు జగన్ గురించి ఇదివరకే చాలానే సుద్దులు చెప్పిన సందర్భాలు గట్టిగానే ఉన్నాయ్. ఇదిగో ఒకానొక ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఓ లుక్కేసేయండి. ‘నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయినా పునర్జన్మ ఇచ్చింది మాత్రం వైఎస్ జగన్‌. నేను ట్రయల్ కోర్టు అడ్వకేట్ అయినా నాకు పిలిచి అడ్వకేట్ జనరల్ పోస్టు ఇచ్చారు. పదేళ్లుగా జగన్‌తో అనుబంధం ఉంది. మా బంధం గురించి తలుచుకుంటే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. నాకు వేరే మాస్క్ ఏం లేదని.. జగన్ ఏం చెప్తే అదే చేస్తాను. నేను అడ్వకేట్ జనరల్ అయినా పార్టీతో సంబంధం, రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకునే దౌర్భాగ్యుడిని కాదు. నాకు పునర్జన్మ ఇచ్చిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన శ్వాసలోనే ఉంటాను’ అని ఇదివరకే ఓ ఇంటర్వ్యూ వేదికగా పొన్నవోలు క్లియర్ కట్‌గా జగన్‌కు ఊడిగం చేస్తానని ఒప్పేసుకున్నారు. దీంతో నాడు.. ఏఏజీ స్థాయి వ్యక్తిని విమర్శించడం కాదు కానీ.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒకరికి కొమ్ము కాయడం ఏంటని సామాన్యుడు మొదలుకుని రాజకీయ నేతల వరకూ అందరూ దుమ్మెత్తి పోశారు.

పొన్నవోలుకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 27 , 2024 | 10:15 PM