చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా..

ABN, Publish Date - Dec 25 , 2024 | 04:08 PM

రాత్రి అన్నంతో ప్యాన్‌కేక్.. తయారీ ఇలా..

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 1/7

గిన్నెలో అన్నం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉల్లికాడ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 2/7

అందులోనే గోధుమపిండి, శనగపిండి, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని మరోసారి కలపాలి.

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 3/7

అనంతరం పావు కప్పు నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగానే ఉండాలి.

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 4/7

పిండి మీద తడిగుడ్డ కప్పేసి కనీసం పావుగంట సేపు పక్కన ఉంచుకోవాలి. పిండిని సమాన భాగాలుగా చేసుకుని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 5/7

ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి బాగా నూనె రాయాలి. తరువాత పిండి ఉండను కవర్‌పై పెట్టి చేత్తోనే వెడల్పుగా పరాటా సైజులో చేసుకోవాలి.

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 6/7

స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకుని ఈ ప్యాన్ కేక్ వేసుకోవాలి. చుట్టూ నూనె పోసుకుంటు కాల్చుకోవాలి

చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్.. తయారీ ఇలా.. 7/7

ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే ప్యాన్ కేక్ రెడీ. చివర్లో కొత్తిమీరతో గార్నీషింగ్ చేసుకోండి.

Updated at - Dec 25 , 2024 | 04:09 PM