Vantalu: ఎగ్‌లెస్ ఆమ్లెట్ రెసిపీ..
ABN, Publish Date - Dec 24 , 2024 | 05:46 PM
ఎగ్‌తో ఆమ్లెట్ చేస్తారని అందరికీ తెలుసు. కానీ, ఎగ్ లేకుండానే ఆమ్లెట్ తయారుచేయొచ్చు తెల్సా. అదెలా అనుకుంటున్నారా. అయితే, క్షణాల్లోనే నోరూరించే ఎగ్‌లెస్ ఆమ్లెట్ రెసిపీ తయారుచేసుకోండిలా..
1/7
వెజ్ ఆమ్లెట్ తయారీకి ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కాసిన్ని పచ్చిమిర్చి తగు మోతాదులో తీసి పక్కన పెట్టుకోండి.
2/7
తాజాగా ఉన్న కొత్తిమీర, పుదీనా తీసుకోండి. తర్వాత వాటిలో తగినంత నీళ్లు పోసి గ్రైండ్ చేయండి.
3/7
ఒక గిన్నెలో కప్పు శనగపిండి తీసుకోండి. పిండిలో తగినంత ఉప్పు, జీలకర్ర, వాము, పసుపు, ఇంగువ, ఛాట్ మసాలా వేయండి.
4/7
శనగపిండి మిశ్రమంలో తగినంత నీళ్లు పోసి బాగా కలపండి.
5/7
సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పెనంపై పోయండి. 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి బాగా కాల్చండి.
6/7
నచ్చితే తురిమిపెట్టుకున్న పనీర్ లేదా ఛీజ్‌ను ఆమ్లెట్ పైన వేసుకోవచ్చు.
7/7
అంతే, క్షణాల్లోనే ఎంతో రుచికరమైన నోరూరించే వెజ్ ఆమ్లెట్‌ని వేడి వేడిగా సర్వ్ చేయండి.
Updated at - Dec 24 , 2024 | 07:20 PM