ఈ ఒక్క డైట్ ప్లాన్ ఫాలో అయితే.. ఈజీగా బరువు తగ్గవచ్చు..!
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:20 PM
బరువు త్వరగా తగ్గాలని అనుకునే వారు వ్యాయామాలు చేస్తారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా సరే బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. ఇలాంటి వారు చేసే తప్పు ఒక సరైన ప్రణాళిక పాటించక పోవడం. బరువు తగ్గాలంటే ఒక ఖచ్చితమైన డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి.
1/5
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం ఎప్పుడూ చల్లనీరు తాగకూడదు
2/5
ఉదయాన్నే అల్పాహారంలో గుడ్డు లేదా ఓట్స్ తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్, కార్బోహేడ్రేట్స్ రెండూ ఉంటాయి.
3/5
మద్యాహ్న భోజనంలో పెరుగు వంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారానికి ముందు సలాడ్ తీసుకోవాలి.
4/5
సాయంత్రం గ్రీన్ టీ ఒక కప్పు తీసుకోవాలి. ఇది కేలరీలు బర్న్ చేయడంలోనూ, శరీరానికి శక్తి ఇవ్వడంలో సహాయపడుతుంది.
5/5
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Updated at - Sep 20 , 2024 | 03:20 PM