CPM: సీతారాం ఏచూరీ సంతాపసభ
ABN, Publish Date - Sep 13 , 2024 | 10:03 AM
నల్గొండ జిల్లా: సీపీఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం ప్రజాస్వామికశక్తులకు తీవ్ర దిగ్భాంతిని కలిగించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. గురువారంనాడు సీపీఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరీ సంతాపసభను నిర్వహించారు. అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి వరకు అంచలంచెలుగా ఎదిగిన సీతారాం ఏచూరీ పోరాట జీవితాన్ని గుర్తుచేశారు. 1997, 2019లో నల్లగొండ లో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభల్లో.. వివిధ సందర్భాలలో నిర్వహించిన పోరాటాలలో సీతారాం ఏచూరీ స్వయంగా పాల్గొన్నారని తెలిపారు. 1994, 1996, 1999, 2004, 2009, 2014, 2018, 2019, 2023లలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో జరిగిన ఎన్నికల సభల్లో జిల్లాలో పలు ప్రాంతాలలో పాల్గొన్నారన్నారు. 2015లో తెలంగాణా సమగ్రాభివృద్ది, బిసి సబ్‌ప్లాన్, ప్రవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ నల్లగొండలో జరిగిన బహిరంగసభలో ప్రధానకార్యదర్శిగా ఎన్నికైన మొదటి బహిరంగసభ అని అన్నారు.
1/6
సీపీఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపసభను ఆ పార్టీ నేతలు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
2/6
నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో సీపీఎం నేతలు సీతారాం ఏచూరి సంతాపసభను నిర్వహించారు. అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
3/6
2015లో తెలంగాణా సమగ్రాభివృద్ది, బీసీ సబ్‌ప్లాన్, ప్రవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ నల్లగొండలో జరిగిన బహిరంగసభలో ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికైన మొదటి బహిరంగసభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
4/6
సీపీఎం నేత సురవరం సుధాకర్ రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో సీతారాం ఏచూరి..
5/6
సీపీఎం నేత బీవీ రాఘవులతో సీతారాం ఏచూరి..
6/6
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దివంగత బుద్ధదేవ్ భట్టాచార్యతో సీతారాం ఏచూరి..
Updated at - Sep 13 , 2024 | 10:03 AM