KCR: నల్గొండలో కేసీఆర్ సభ...
ABN, Publish Date - Feb 14 , 2024 | 12:17 PM
నల్గొండ: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభకు కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు. పిడికెడు మంది కోసమో, ఒకరిద్దరి కోసమో ఈ సభ జరపడం లేదు. కృష్ణా నీళ్లలో మన హక్కుల కోసం, మన జీవన్మరణ సమస్య కోసం, మన బతుకు కోసం పెట్టిన సభ. కేంద్ర ప్రభుత్వానికి, బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్‌కు, కేంద్ర మంత్రికి ఈ సభ హెచ్చరిక’’ అంటూ కేసీఆర్ ప్రసంగించారు.
1/5
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్..
2/5
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు హాజరై ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత..
3/5
నల్లగొండ జిల్లాలో జరిగిన సభలో బీఆర్ఎస్ కార్యకర్త తన శరీరంపై గులాబీ రంగు పూసుకుని, జై కేసీఆర్ అని రాసుకుని.. తన అభిమానాన్ని ఈ విధంగా తెలుపుతున్న దృశ్యం.
4/5
ఎండను కూడా లెక్కచేయకుండా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం వినేందుకు వచ్చిన జనాలు..
5/5
కేసీఆర్‌ను చూసేందుకు, ప్రసంగాన్ని వినేందుకు కొంతమంది కార్యకర్తలు ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా వేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన కటౌట్లపైకి ఎక్కి ఆసక్తిగా తిలకిస్తున్న దృశ్యం.
Updated at - Feb 14 , 2024 | 12:17 PM