మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలి: జస్టిస్ ఎన్వీ రమణ
ABN, Publish Date - Mar 11 , 2024 | 01:18 PM
ఖమ్మం: నగరంలో ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో ఎర్నేని రామారావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ మాతృ భాష పరిరక్షణకు అందరం కృషి చేయాలని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ల్యాబ్‌ను ఆయన ప్రారంభించారు.
1/7
ఖమ్మంలో జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను నిర్వాహకులు సన్మానిస్తున్న దృశ్యం.
2/7
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేన జస్టిస్ ఎన్వీ రమణ.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ప్రక్కన ఎర్నేని రామారావును చూడవచ్చు.
3/7
ఖమ్మంలో ఆదివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ..
4/7
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఎర్నేని రామారావు..
5/7
ఖమ్మంలో ఆదివారం జస్టిస్ ఎన్వీ రమణ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రసంగిస్తున్న దృశ్యం.
6/7
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో ముచ్చటిస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు..
7/7
ఖమ్మం స్వర్ణ భారతి కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశాలో పాల్గొన్న టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రసంగిస్తున్న దృశ్యం.
Updated at - Mar 11 , 2024 | 01:18 PM