యాదాద్రిభువనగిరిలో బతుకమ్మ సంబరాలు
ABN, Publish Date - Oct 03 , 2024 | 01:27 PM
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపంగా నిలిచే బతుకమ్మ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రాంరభమయ్యాయి. ప్రకృతిని దేవతగా కొలుస్తూ సాగే ఈ వేడుకలు మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిది రోజులు కొనసాగనున్నాయి. గౌరమ్మను ఒక్కోరోజు ఒక్కో పేరుతో తీరొక్క పూలతో పూజించి మహిళలు బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.
1/5
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
2/5
ఈ మహిళలందరూ ఒకే రకం చీరలు ధరించి.. బతుకమ్మలు తీసుకువస్తున్న దృశ్యం..
3/5
ఎంగిలి బతుకమ్మలను ఒక చోట పేర్చి పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తున్న మహిళలు..
4/5
ఎంగిలి బతుకమ్మలను ఒక చోట పేర్చి దాండియా ఆడుతున్న మహిళలు..
5/5
బతుకమ్మలకు పూజలు చేస్తూ.. నృత్యాలు చేస్తు్న్న మహిళలు..
Updated at - Oct 03 , 2024 | 01:27 PM