పారిశ్రామిక దిగ్గజం రతన్ నావల్ టాటా.
ABN, Publish Date - Oct 10 , 2024 | 01:45 PM
భారత దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది! జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలు..
1/11
సూనూ, నావల్ టాటా దంపతులకు 1937లో రతన్ టాటా జన్మించారు. (రతన్ టాటా తన సోదరుడు జిమ్మీతో 1945లో)
2/11
1955 నాటికి రతన్ టాటా వయస్సు 17 ఏళ్లు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ చదివారు. ( LA లో ఉన్న సమయంలో యువ రతన్ టాటా)
3/11
కార్నెల్‌లో ఉన్న సమయంలో రతన్ టాటా..
4/11
1991లోJRD టాటా తర్వాత రతన్ టాటా.. టాటా సన్స్ ఛైర్మన్‌గా, టాటా ట్రస్ట్‌ల ఛైర్మన్‌గా ఎంపికయ్యారు..
5/11
జంషెడ్‌పూర్‌లో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో JRD టాటా, రతన్ టాటా
6/11
1998లో టాటా ఇండికా, టాటా మోటార్స్ ప్రారంభం.. డీజిల్ ఇంజిన్‌తో కూడిన మొదటి భారతీయ కారు.
7/11
2000 లో టాటా గ్రూప్ వృద్ధి చెందింది. లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌తో సహా దిగ్గజ బ్రిటిష్ ఆస్తులను కైవసం చేసుకోవడంతో టాటా గ్రూప్ విస్తరించింది.
8/11
2008లో రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి టాటా నానోను ప్రారంభించిన దృశ్యం.
9/11
2008లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకుంటున్న రతన్ టాటా..
10/11
2012లో టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి రతన్ టాటా వైదొలిగారు. ఆ తర్వాత టాటా సన్స్ ఎమిరిటస్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
11/11
2022లో ముంబైలోని హెచ్‌ఎస్‌ఎన్‌సి యూనివర్సిటీలో జరిగిన మొదటి ప్రత్యేక కాన్వొకేషన్‌లో గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ ప్రదానం సందర్భంగా రతన్ టాటా
Updated at - Oct 10 , 2024 | 01:52 PM