పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ వారాహి యాత్ర దృశ్యాలు..
ABN, Publish Date - Apr 22 , 2024 | 11:32 AM
పశ్చిమ గోదావరి జిల్లా: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం నరసాపురం, భీమవరంలో వారాహి యాత్ర నిర్వహించారు. పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించి, అనంతరం భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు. రెండుచోట్ల మూడు పార్టీల శ్రేణులతోపాటు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పట్టణాల రహదారులు జన సంద్రంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వ హయాంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఆక్వా రంగం జగన్ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది. మేం అధికారంలోకి రాగానే ఈ రంగాన్ని మెరుగు పరుస్తాం. లేసు పరిశ్రమకు సబ్సిడీలు ఇచ్చి పూర్వ వైభవం తీసుకొస్తా. మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే బాధ్యత నాది. మరుగున పడిన సొసైటీలకు పూర్వ వైభవం తీసుకుని వస్తా. భీమవరం పట్టణానికి రింగు రోడ్డు, అవసరమైన వంతెనలను ఏర్పాటు చేస్తాం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
1/6
నరసాపురం వారాహి విజయభేరి సభకు ర్యాలీగా బయలు దేరిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యం.
2/6
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ గుర్తు గాజు గ్లాసు చూపిస్తున్న దృశ్యం.
3/6
పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో కూటమి నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్..
4/6
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనం..
5/6
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.
6/6
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరంలో నిర్వహించిన బహిరంగంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు.. వారిని గెలిపించాలని కోరుతున్న జనసేనాని..
Updated at - Apr 22 , 2024 | 11:32 AM