లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ

ABN, Publish Date - Jan 17 , 2024 | 01:45 PM

శ్రీ సత్యసాయి జిల్లా: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిని సందర్శించిన ఆయన పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత పురాతత్వ చరితంలో ‘లేపాక్షి’ శిల్ప సంపద ఓ మహా అద్భుతం అని.. ప్రధాని మోదీ అభివర్ణించారు.

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 1/6

శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షిలో పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యం.

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 2/6

పర్యాటక పుణ్యక్షేత్రం లేపాక్షి చారిత్రక విశిష్టత, స్థానిక ప్రఖ్యాత తోలుబొమ్మల కళా ఖండాల విశిష్టతను టీవీలో వీక్షిస్తున్న ప్రధాని మోదీ..

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 3/6

పర్యాటక కేంద్రం లేపాక్షిలో పాపనాశేశ్వర, వీరభద్ర స్వామి ఆలయాలను దర్శించిన ప్రధాని మోదీ కళ్లు మూసుకుని ధ్యానం చేస్తున్న దృశ్యం.

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 4/6

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా కళాకారులు లేపాక్షి చారిత్రక విశిష్టత గురించి బృందగానం చేస్తున్న దృశ్యం.

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 5/6

లేపాక్షికి విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్రమోదీని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు..

లేపాక్షి శిల్ప సంపద అద్భుతం.. ప్రధాని మోదీ 6/6

తనను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులు, బీజేపీ కార్యకర్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివాదం తెలుపుతున్న దృశ్యం.

Updated at - Jan 17 , 2024 | 01:53 PM