కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం..

ABN, Publish Date - Jan 21 , 2024 | 07:26 AM

విజయవాడ: కోడి కత్తి శ్రీను జైలు నుంచి విడుదల చేయాలని. సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అవ్వాలని.. కోడి కత్తి శ్రీను తల్లి సోదరుడు గత మూడు రోజులుగా విజయవాడ గాంధీనగర్‌లో రమా ఫంక్షన్ హాల్‌లో చేస్తున్న నిరాహార దీక్షను రాత్రి పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.

కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం.. 1/5

కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేయాలని.. సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు అవ్వాలని డిమాండ్ చేస్తూ శీను, తల్లీ, సోదరుడు చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. తల్లి సావిత్రమ్మను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.

కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం.. 2/5

కోడి కత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు, సమతా సైనిక దళ్ ప్రతినిధులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు

కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం.. 3/5

దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో.. సమతా సైనిక దళ్ ప్రతినిధి శ్వేత పోలీసులతో వాగ్వానికి దిగిన దృశ్యం..

కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం.. 4/5

కోడి కత్తి శీను తల్లి, సో్దరుడు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన సమతా సైనిక దళ్ ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్న దృశ్యం.

కోడి కత్తి శీను తల్లి, సోదరుడి దీక్ష భగ్నం.. 5/5

కోడి కత్తి శీను తల్లి, సో్దరుడు చేపట్టిన దీక్షను భగ్నం చేసి వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా.. రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్న సమతా సైనిక దళ్ కార్యకర్తలు

Updated at - Jan 21 , 2024 | 07:26 AM