Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర..

ABN, Publish Date - Apr 08 , 2024 | 12:15 PM

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఆదివారం నిర్వహించిన రోడ్‌షోలు వెలవెలబోయాయి. కొనకనమిట్ల మండలం దొనకొండ అడ్డురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభ పేలవంగా సాగింది. వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసినా ప్రజల నుంచి స్పందన కరువైంది. మద్యం, డబ్బులు ఆశ చూపినా సభకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో అనేక ప్రాంతాలకు వెళ్లిన బస్సులు ఖాళీగానే తిరుగుముఖం పట్టాయి. దీంతో సభాప్రాంగణంలోని అత్యధిక భాగం ఖాళీగా కన్పించింది. కనిగిరితోపాటు ముఖ్యప్రాంతాల్లో జగన్‌ రోడ్‌షోలు నిర్వహించగా ఎక్కడా పెద్దగా జనం కన్పించలేదు. సీఎం పర్యటన సాగినంత దూరం విద్యుత్‌ తీగలు, సర్వీసు వైర్లు తొలగించడంతో కరెంటు లేక ప్రజలు పడరానిపాట్లు పడ్డారు. ఓ వైపు ఎండ తీవ్రత, మరో వైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. జగన్‌ తన ప్రసంగంలో పార్టీ కేడర్‌ ఊసెత్తకపోగా స్థానిక సమస్యలను ప్రస్తావించకపోవడం ఇటు పార్టీ క్యాడర్‌, అటు నాయకులు డీలాపడ్డారు.

Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర.. 1/5

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, దొనకొండ అడ్డురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభ పేలవంగా సాగింది. జనం లేక ఖాళీగా ఉన్న గ్రౌండ్..

Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర.. 2/5

ప్రకాశం జిల్లా, కొనకనమిట్ల మండలం, దొనకొండ అడ్డురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన సభకు జనం పెద్దగా రాకపోయినా.. జగన్ మాత్రం అక్కడ ప్రసంగించి వెళ్లిపోయారు.

Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర.. 3/5

సీఎం జగన్మోహన్ రెడ్డి ‘సిద్ధం’ సభకు వచ్చిన కార్యకర్తలకు వైసీపీ నేతలు మద్యం సరఫరా చేయగా.. సభా ప్రాంగణం ప్రక్కనే మద్యం సేవిస్తున్న దృశ్యం.

Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర.. 4/5

ముఖ్యమంత్రి జగన్ ‘సిద్ధం’ సభ నేథ్యంలో రోడ్డును బ్లాక్ చేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వాహనదారులు..

Jagan: ప్రకాశం జిల్లాలో జగన్ ‘సిద్ధం’ యాత్ర.. 5/5

సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ నేథ్యంలో రోడ్డును బ్లాక్ చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు..

Updated at - Apr 08 , 2024 | 12:20 PM