Dulif Trophy.. దులీఫ్ ట్రోఫీ విజేత ఇండియా– ఏ
ABN, Publish Date - Sep 23 , 2024 | 12:40 PM
అనంతపురం: దులీఫ్ ట్రోఫీను ఇండియా– ఏ జట్టు కైవసం చేసుకుంది. టోర్నీలో 12 పాయింట్లతో ఇండియా– ఏ జట్టు అగ్రస్థానంలో నిలిచి టోర్నీ విజేతగా నిలిచింది. 9 పాయింట్లతో ఇండియా– సీ జట్టు రన్నర్స్‌గా నిలిచింది. అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో చివరి రౌండ్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఇండియా ఏ జట్టు 132 పరుగులతో ఇండియా సీ జట్టుపై, ఇండియా డీ జట్టు 257 పరుగుల భారీ తేడాతో ఇండియా– బీ జట్టుపై విజయం సాధించాయి.
1/7
దులీప్ ట్రోఫీ విజేత ఇండియా– ఏ జట్టుకు విన్నర్స్ కప్ అందజేసిన ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు
2/7
దులీప్ ట్రోఫీ కప్ గెలుచుకున్న ఆనందంలో ఇండియా– ఏ జట్టు..
3/7
ప్రథమ బహుమతిగా రూ. 2 లక్షల 50వేల చెక్కు అందుకుంటున్న ఇండియా– ఏ జట్టు కెప్టెన్.. ప్రక్కన మంత్రి పయ్యావుల కేశవ్..
4/7
దులీప్ ట్రోఫీ రన్నర్స్ కప్ అందుకున్న సంతోషంలో ఇండియా– సీ జట్టు..
5/7
రన్నర్స్ విజేతలకు మంత్రి పయ్యావుల కేశవ్ కప్‌తోపాటు రూ. 1 లక్షా 50 వేల చెక్కును అందజేశారు.
6/7
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు సంబంధించి ఏ గ్రౌండ్‌లో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ రూ. 50వేల చెక్‌ను అందజేస్తు్న్న దృశ్యం..
7/7
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు సంబంధించి బి గ్రౌండ్‌లో ఏసీఏ అతిథి ఆర్.వి.ఎస్.కె. రంగారావ్ క్రీడాకారులకు రూ. 50వేల చెక్‌ను అందజేశారు.
Updated at - Sep 23 , 2024 | 12:40 PM