బొబ్బిలిలో డ్రగ్స్ అవగాహన సదస్సు
ABN, Publish Date - Oct 01 , 2024 | 10:53 AM
విజయనగరం జిల్లా: మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలపై యువతను చైతన్యపరిచి.. మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాన్ని సోమవారం బొబ్బిలి పట్టణంలోని శ్రీ సూర్య ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ ప్రత్యేక అతిథిగా.. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1/6
బొబ్బిలిలో నిర్వహించిన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సులో నటుడు సాయికుమార్..
2/6
యువతను మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కాకుడదంటూ 'సంకల్పం' కార్యక్రమంలో పిలుపునిచ్చిన ప్రముఖ నటుడు సాయికుమార్..
3/6
'సంకల్పం' కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్...
4/6
నటుడు సాయికుమార్ 'సంకల్పం' కార్యక్రమంలో విజయనగరం జిల్లా డీఎస్పీ శ్రీనివాసరావు ముచ్చటిస్తున్న దృశ్యం..
5/6
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 'సంకల్పం' కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న నటుడు సాయికుమార్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు..
6/6
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా బొబ్బిలిలో నిర్వహించిన 'సంకల్పం' కార్యక్రమంలో కళాకారులు, నిర్వాహకులతో నటుడు సాయికుమార్..
Updated at - Oct 01 , 2024 | 10:53 AM