పోలీసు అమర వీరులకు సీఎం చంద్రబాబు ఘన నివాళి..
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:12 AM
విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రైమ్ రేట్ జీరోకు రావాలని, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడాలని చెప్పారు. పోలీసు అమరవీరుల స్థూపాన్ని అమరావతిలో నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎస్ నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ముఖ్య అధికారులు పాల్గొని పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు.
1/6
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది.
2/6
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
3/6
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తున్న దృశ్యం..
4/6
పోలీస్ అమరవీరులకు సెల్యూట్ చేస్తున్న సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత.. ప్రక్కన డీజీపీ ద్వారకా తిరుమలరావు.
5/6
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
6/6
పోలీస్ సేవాకార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న సీఎం చంద్రబాబు..
Updated at - Oct 22 , 2024 | 11:12 AM