TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ

ABN, Publish Date - Jan 19 , 2024 | 11:55 AM

కృష్ణాజిల్లా: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 28వ వర్థంతి సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభను జనసేన పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభాప్రాంగణం వద్ద భారీ స్వాగత ఫ్లెక్సీలు, పసుపు జెండాలతో అలంకరించారు.

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 1/9

కృష్ణాజిల్లా, గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభలో పాల్గొనే ముందు నందమూరి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న దృశ్యం.

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 2/9

గుడివాడలో జరిగిన ‘రా కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం.

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 3/9

గుడివాడలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్న నారా చంద్రబాబు నాయుడు..

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 4/9

గుడివాడలో జరిగిన ‘రా కదిలి రా’ బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న నారా చంద్రబాబు నాయుడు.

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 5/9

స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రమాలికతో కూడిన క్యాల్యండర్‌ను చంద్రబాబుకు అందజేస్తున్న టీడీపీ శ్రేణులు..

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 6/9

‘రా కదిలి రా’ బహిరంగ సభలో జగనన్నే మా భవిష్యత్ నాశనం చేసిందంటూ అమరావతి మహిళా రైతులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 7/9

గుడివాడ, మల్లాయిపాలెం వద్ద జరిగిన ‘రా కదిలిరా’ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 8/9

‘రా కదిలిరా’ సభా వేదికపై నారా చంద్రబాబు నాయుడుతోపాటు నిలుచున్న పలువురు టీడీపీ నేతలు..

TDP: గుడివాడలో చంద్రబాబు ‘రా కదిలిరా’ సభ 9/9

గుడివాడలో జరిగిన బహిరంగ సభకు చంద్రబాబు రావడంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పార్టీ జెండాలతో ఈలలు, కేకలు, నినాదాలు చేస్తున్న దృశ్యం.

Updated at - Jan 19 , 2024 | 11:55 AM