TDP: చంద్రబాబు నివాసంలో సంబరాలు
ABN, Publish Date - Jun 05 , 2024 | 11:45 AM
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎన్డీయే కూటిమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి....తాతకు, బంధువులకు కేక్ తినిపించాడు.
1/6
ఏపీలో టీడీపీ ఎన్డీయే కూటిమి భారీ విజయం సాధించడంతో ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన కుటుంబసభ్యులతో సంబరాలు జరుపుకున్నారు.
2/6
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం భారీ విజయం సాధించించి. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసి ఆయన సతీమణి నారా భువనేశ్వరి విక్టరీ సంకేతం చూపిస్తున్న దృశ్యం..
3/6
ఉండవల్లిలోని చంద్రబాబు తన నివాసంలో మనవడు దేవాన్ష్‌తో కేక్ కట్ చేయిస్తున్న దృశ్యం.
4/6
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్.. తాత చంద్రబాబుకు కేక్ తినిపిస్తున్న దృశ్యం...
5/6
మంగళగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన లోకేష్‌కు కేక్ తినిపిస్తున్న ఆయన సతీమణి నారా బ్రాహ్మణి..
6/6
ఉండవల్లిలోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫోటో..
Updated at - Jun 05 , 2024 | 11:45 AM