అంగన్‌వాడీల దీక్ష భగ్నం.. అరెస్టు..
ABN, Publish Date - Jan 22 , 2024 | 11:18 AM
విజయవాడ: తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీల దీక్షను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేసి.. అరెస్టు చేశారు. శిబిరంలో ఉన్న సుమారు 2వేల మందిని మూకుమ్మడిగా పోలీసులు అరెస్టులు చేశారు. టెంట్ కూల్చేసి, లైట్లు ఆపేసి మహిళలను బలవంతంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో ఎక్కించారు. నిద్రపోతున్న అంగన్‌వాడీల మీద పోలీసులు జులుం ప్రదర్శించారు.
1/6
తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీల దీక్షను అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు భగ్నం చేసి.. వారిని అరెస్టు చేశారు.
2/6
విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీలను పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్న దృశ్యం.
3/6
అంగన్‌వాడీ మహిళల దీక్ష శిబిరాన్ని అర్ధరాత్రి పోలీసులు చుట్టుముట్టి.. నిద్రిస్తున్న మహిళలను లేపి అరెస్టు చేస్తున్న దృశ్యం.
4/6
అంగన్‌వాడీలు సోమవారం ఛలో విజయవాడకు పిలుపివ్వడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్న అంగన్‌వాడీలు
5/6
ఛలో విజయవాడ కార్యక్రమం కోసం తరలివచ్చిన అంగన్‌వాడీలు.. టెంట్ వద్ద చలిలో రోడ్డుపై నిద్రిస్తున్న దృశ్యం..
6/6
ఛలో విజయవాడ కార్యక్రమానికి తరలి వస్తున్న అంగన్‌వాడీలను ఎక్కడిక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యం.
Updated at - Jan 22 , 2024 | 11:18 AM