Switzerland: స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి సంక్రాంతి విందు కార్యక్రమం రద్దు..కానీ
ABN , Publish Date - Jan 16 , 2024 | 08:13 PM
స్విట్జర్లాండ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంక్రాంతి విందు కార్యక్రమం రద్దైంది. చలి తీవ్రత, పొగ మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఆలస్యమైంది.
స్విట్జర్లాండ్(Switzerland)లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంక్రాంతి విందు కార్యక్రమం రద్దైంది. చలి తీవ్రత, పొగ మంచు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విమానాల రాకపోకలకు ఆలస్యమైంది. ఈ క్రమంలో న్యూఢిల్లీ నుంచి ఆదివారం జ్యూరిచ్‌కు బయలుదేరిన విమానం సుమారు ఆరుగంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి జ్యూరిచ్ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఏర్పాటు చేసిన సంక్రాంతి విందు కార్యక్రమం రద్దైంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral News: వామ్మో.. పేపర్ బ్యాగ్ ధర మూడు లక్షల రూపాయలా?
అయితే స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు, హైద్రాబాద్(Hyderabad)కు చెందిన మదాల అరవింద్ అధ్వర్యంలో సంక్రాంతి విందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కానీ ముఖ్యమంత్రి ఆలస్యంగా చేరుకోవడంతో విమానాశ్రయంలోనే సీఎంకు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో వెంటనే రేవంత్ రెడ్డి దావోస్ నగరానికి బయలుదేరి వెళ్లారని ప్రవాసీయులు తెలిపారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం అధ్యక్షుడితో భేటీ అయ్యారు. హైదరాబాద్లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం సీ4ఐఆర్ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన వారిలో మదాల అరవింద్‌తో పాటు ప్రవాసీ ప్రముఖులు హరీష్ రెడ్డి(నిర్మల్), ఇమ్రాన్ (జగిత్యాల), అభిషేక్ రెడ్డి (సిద్దిపేట), రాహుల్ రెడ్డి కుందవరం(మహబూబ్ నగర్), జాకీర్ మోహమ్మద్ (హైద్రాబాద్), స్విస్ తెలుగు అసోసియేషన్ లీడర్ ఫణి, తెలంగాణ పీసీసీ ఎన్నారై నేత మంద భీం రెడ్డి సహా తదితరులు ఉన్నారు.