Share News

NTR-బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్‌ 101 జయంతి ఉత్సవాలు

ABN , Publish Date - May 29 , 2024 | 09:41 PM

'నేల ఈనిందా ... ఆకాశం చిల్లు పడిందా..' అన్న ఎన్టీఆర్ నోటి నుంచి ఈ డైలాగ్ రాగానే మైదానమంతా పావుగంట సేపు దిక్కులు పిక్కటిల్లేలా కరతాల ధ్వనులు.. నినాదాలు. 'జనం...జనం..'-'ప్రభంజనం.....'అన్న ఎన్టీఆర్ చైతన్య రథం మీద బయలుదేరగానే...

NTR-బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్‌ 101 జయంతి ఉత్సవాలు

'నేల ఈనిందా ... ఆకాశం చిల్లు పడిందా..' అన్న ఎన్టీఆర్ నోటి నుంచి ఈ డైలాగ్ రాగానే మైదానమంతా పావుగంట సేపు దిక్కులు పిక్కటిల్లేలా కరతాల ధ్వనులు.. నినాదాలు. 'జనం...జనం..'-'ప్రభంజనం.....'అన్న ఎన్టీఆర్ చైతన్య రథం మీద బయలుదేరగానే జనాలు గ్రామాలకు గ్రామాలు పొలం పనులు కూడా పక్కనపెట్టి రోడ్ల మీదకు చేరి ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురు చూసిన రోజులు ఉన్నాయి.


ఏంటి ఆ సమ్మోహనం ? ఓటు హక్కు లేని కుర్రాళ్ల నుంచి పండు ముసలి వరకు పసి వాళ్లైపోయి అన్న స్పీచ్ వినగానే కేరింతలు కొట్టటం ఏంటి ? ఏంటి ఎన్టీఆర్ లోని గొప్పతనం ?.. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని  ఎన్నికల్లో చూసుకుందాం రా..! అని తొడగొట్టి సవాల్ చేయడం వెనుక తెగింపు ఏంటి ? కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలి.. భూస్థాపితం చెయ్యాలి.. కుక్క మూతి పిందెలు.. అని ఏకి పారేస్తూ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం అన్నను నేనున్నా అంటూ అలుపెరగక.. విరామమెరుగక రేయింబవళ్లు చైతన్య రథంలో ఆంధ్ర దేశం చుట్టేస్తున్న ఎన్టీఆర్ ప్రభంజనం ఢిల్లీ పీఠంలో గుబులు పుట్టించింది.


రోడ్డు పక్కనే స్నానం. .బట్టలు ఉతుక్కోవడం.. ప్రజలతోనే సహపంక్తి భోజనాలు.. అలుపెరుగని పోరాటం ఎన్టీఆర్ వల్ల ఈనాడు బాగుపడిందో.. ఈనాడు వల్ల ఎన్టీఆర్ లబ్ధి పొందారో  తెలీదు కానీ అప్పట్లో జనాలు ఈనాడు పేపర్‌లో ఎన్టీఆర్ బొమ్మల కోసం ఎగబడి కొన్నారు ! చరిత్ర ..చరిత్ర సృష్టించబడింది.. కేవలం తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆ మహానుభావుడి 101వ జయంతి వేడుకలను బే ఏరియాలో ఈ రోజు తెలుగుదేశం సీనియర్ నాయకుడు జయరాం  కోమటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.


nri-viral.jpg

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయంకోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి, వారివారి నియోజకవర్గాల్లో పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను వచ్చినవారితో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భక్త భల్లా, వెంకట్ కోగంటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, సతీష్ అంబటి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ళ, రవి కిరణ్ , నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 09:42 PM