Share News

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:56 PM

Instagram New Feature: మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా..

Instagram: ఇన్‌స్టాగ్రమ్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!
Instagram New Feature

Instagram New Feature: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు ఎక్కువగా పాపులర్ అయ్యింది ఇన్‌స్టాగ్రమ్ అని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు మొదలు.. పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాగ్రమ్‌ను యూజ్ చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలుకొని.. రాత్రి పడుకునే వరకు ఇన్‌స్టాగ్రమ్‌లో రీల్స్ చూడటం, రీల్స్ పోస్ట్ చేయడం.. చాటింగ్ వంటివి చేస్తుంటారు. అయితే, మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రమ్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా ఎవరైనా చాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భా్ల్లో తప్పుడు సందేశాలు పంపుతుంటారు. దాంతో వాటిని డిలీట్ చేసి.. మళ్లీ పంపాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అలా కాకుండా.. వాట్సాప్ మాదిరిగానే మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్‌ను తీసుకువచ్చింది ఇన్‌స్టాగ్రమ్.

చాట్ బాక్స్‌లో పైన ‘ఎడిట్ మెసేజ్’ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇన్‌స్టాగ్రమ్. ఈ సౌకర్యంతో.. యూజర్లు పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల వ్యవధిలో ఎడిట్ చేసి, రీ సెండ్ చేయొచ్చు. ఆ వ్యవధి దాటితే మెసేజ్ ఎడిట్ చేయడం కష్టమవుతుంది. ఈ ఫీచర్‌పై ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫీచర్ ఇన్‌స్టాలో అందుబాటులోకి రావడంతో యూజర్లు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఎడిట్ ఫీచర్‌‌తో ప్రయోజనాలు..

ఎడిట్ ఫీచర్ ద్వారా.. యూజర్లు పంపిన మెసేజ్‌లో అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా తప్పుడు మెసేజ్ పెట్టినా.. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, యూజర్లు ఒకవేళ తమ మెసేజ్‌ను ఎడిట్ చేసినట్లయితే.. ఎడిటెడ్ లేబుల్ కనిపిస్తుంది. అంటే మీరు మెసేజ్‌ను ఎడిట్ చేసినట్లుగా అవతలి వ్యక్తులకు తెలిసేలా ఈ గుర్తు ఉంటుంది. ఇక మొదట పంపిన మెసేజ్‌ను అవతలి వారు చదివిన తరువాత సాధారణంగానే ‘సీన్’ అని పడుతుంది. కానీ, చదివిన మెసేజ్‌ను ఎడిట్ చేసినట్లయితే.. మళ్లీ అన్ సీన్ అని పడుతుంది. ఇక ఒకసారి పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల వ్యవధిలోనే మార్చడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఛాన్స్ ఉండదు.

ఇన్‌స్టాగ్రమ్‌లో మెసేజ్ ఎడిట్ చేయడం ఎలా?

👉 ముందుగా ఇన్‌స్టాగ్రమ్ యాప్ ఓపెన్ చేయాలి.

👉 యాప్‌లో చాట్ బాక్స్ ఓపెన్ చేయండి.

👉 ఒకరి చాట్‌ను ఓపెన్ చేసి.. అందులోని ఒక మెసేజ్‌ను నొక్కి పట్టుకోవాలి.

👉 ఆ వెంటనే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.

👉 అందులో ‘ఎడిట్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

👉 ఇప్పుడు ఆ మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.

👉 అంతా ఓకే అనుకుంటే.. మళ్లీ ఆ మెసేజ్‌ను పంపొచ్చు.

👉 15 నిమిషాలు దాటితే ఈ ఆప్షన్ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

👉 ఇక ఎడిట్ చేసిన మెసేజ్‌కు ఎడిటెడ్ అని సింబల్ కనిపిస్తుంది.

👉 ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మీరు పంపే ప్రతి మెసేజ్‌ను కేవలం ఐదుసార్లు మాత్రమే ఎడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

Updated Date - Feb 03 , 2024 | 04:56 PM