Share News

Hair: జుట్టు తెల్లబడే సమస్య నుండి రక్షించడానికి 5 సహజ నివారణలు ఏంటంటే..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 02:31 PM

ఆహార మార్పులతో లోపాలను సరిదిద్దడం చాలా ముఖ్యం. విటమిన్ B-12 సమృద్ధిగా ఉన్న ఆహారాలు, సీఫుడ్, గుడ్లు, మాంసాలు, పాలు, సాల్మన్, చీజ్ వంటి విటమిన్ డి వంటి పోషకాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటాయి.

Hair: జుట్టు తెల్లబడే సమస్య నుండి రక్షించడానికి 5 సహజ నివారణలు ఏంటంటే..!
Hair

జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటే రెండు పదుల వయసు దాచి పెట్టచ్చనేది అందరిలోనూ ఉండే అభిప్రాయమే.. అయితే వాతావరణంలో పెరిగిన కాలుష్యం కారణంగా దుమ్ము, ధూళి కారణంగా కూడా జుట్టు తెల్లబడటం అనే సమస్య మొదలవుతుంది. ఇది అగస్మాత్తుగా జరిగితే మాత్రం దానికి పోషకాహార లోపం కూడా కారణం కావచ్చు. అయితే జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. దీనికి సహజమైన నివారణలను ఎంచుకోవడమే నయం. అవేమిటంటే..

జుట్టు తెల్లబడేందుకు 5 ప్రధాన కారణాలు ఇవే..

1. పోషకాహార లోపం:

ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ B12 లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడే సమస్యకు దారి తీస్తుంది, మామూలుగా అందరిలోనూ కనిపించే రక్తహీనత కారణంగా 55% మంది రోగులలో 50 ఏళ్లలోపు జుట్టు రంగు పోయి కనిపిస్తారు. రాగి, ఇనుము, కాల్షియం, జింక్‌లోని లోపాలు బలహీనమైన మెలనోజెనిసిస్‌తో ఇది ముడిపడివుంటుంది, జుట్టు పిగ్మెంటేషన్‌ను ఇవి ప్రభావితం చేస్తాయి.

2. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత:

థైరాయిడ్ హార్మోన్లు T3, T4లో అలోపేసియా వెంట్రుకలలో మార్పులకు దారితీస్తుంది. ఈ హార్మోన్లు నేరుగా హెయిర్ ఫోలికల్స్‌ను ప్రభావితం చేస్తాయి, మెలనోజెనిసిస్‌లో కీలక పాత్ర పోషిస్తాయి.

3. ధూమపానం, ఆక్సీకరణ ఒత్తిడి:

అక్రోమోట్రిచియాలో ధూమపానం త్వరగా తెల్ల జుట్టు వచ్చే అవకాశాలను పెంచుతాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

4. ప్రోటీన్ లేకపోవడం, హైపోపిగ్మెంటేషన్:

జుట్టు రివర్సిబుల్ హైపోపిగ్మెంటేషన్ అనేది ప్రోటీన్ శక్తి పోషకాహార లోపంతో సంబంధం కలిగి ఉంటుంది. రాగి, ఇనుము లోపాలు తెల్ల జుట్టుకు కారణం అవుతాయి.

ఇది కూడా చదవండి.. మసాలాలు రుచిగా లేవా? ఈ దినుసుల్ని ఎలా నిల్వ చేయాలంటే.. ఈ ఐదు చిట్కాలూ పాటించి చూడండి..!


తెల్ల జుట్టును సహజంగా నిరోధించడానికి 5 మార్గాలు ఇవే..

1. యాంటీ ఆక్సిడెంట్, రిచ్ డైట్:

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తాజా పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ, ఆలివ్ నూనె, చేపలు ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్ల, అద్భుతమైన మూలాలు. ఆకు కూరలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు, పండ్లను వాటి యాంటీఆక్సిడెంట్ తీసుకోవాలి.

2. విటమిన్ లోపాలు:

ఆహార మార్పుల ద్వారా లోపాలను సరిదిద్దడం చాలా ముఖ్యం. విటమిన్ B-12 సమృద్ధిగా ఉన్న ఆహారాలు, సీఫుడ్, గుడ్లు, మాంసాలు, పాలు, సాల్మన్, చీజ్ వంటి విటమిన్ డి వంటి పోషకాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటాయి.

3. ధూమపానం మానేయడం:

ధూమపానం మానేయడం మొత్తం ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాకుండా, అగస్మాత్తుగా వచ్చే తెల్లజుట్టును నివారించడంలో సహాయపడుతుంది. పరిశోధకులు ధూమపానం, పెరిగిన ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా జుట్టు పిగ్మెంటేషన్ కోల్పోవడం మధ్య సంబంధం ఉంటుందట.

4. ఉసిరికాయ:

యాంటీ ఏజింగ్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఉసిరిని ఆహారంలో లేదా సప్లిమెంట్‌గా చేర్చడం వల్ల పిగ్మెంటేషన్‌ను ప్రోత్సహిస్తుంది.

5. రాగి అధికంగా ఉండే ఆహారాలు:

మాంసం, కాయధాన్యాలు, బాదం, డార్క్ చాక్లెట్, ఆస్పరాగస్ వంటి రాగి అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారం, లోపాలను పరిష్కరించడం, జీవనశైలిలో మార్పులు వల్ల అనుకోకుండా వచ్చే జుట్టు తెల్లబడే ముప్పును అధిగమించవచ్చు.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 09 , 2024 | 02:33 PM