Share News

Spices: మసాలాలు రుచిగా లేవా? ఈ దినుసుల్ని ఎలా నిల్వ చేయాలంటే.. ఈ ఐదు చిట్కాలూ పాటించి చూడండి..!

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:15 PM

సుగంధ ద్రవ్యాలను గాలి చొరబడని కంటైనర్లలో ఉంచాకా.. గాలి పెద్దగా తగలని ప్రదేశంలో నిల్వ చేయాలి. వీటిని చాలా కాలంపాటు తాజాగా, రుచిగా ఉంచుకోవాలంటే వాటిని వేడి పొయ్యిల పక్కన, వేడి తగిలే విధంగా ఉంచకూడదు.

Spices: మసాలాలు రుచిగా లేవా? ఈ దినుసుల్ని ఎలా నిల్వ చేయాలంటే.. ఈ ఐదు చిట్కాలూ పాటించి చూడండి..!
the spices

సుగంధ ద్రవ్యాలతో చేసే వంట మొత్తం వంటకం రుచినే పెంచుతుంది. భారతీయ వంటలలో మసాలా దినుసులది ప్రత్యేకమైన స్థానం. ఈ దినుసులతో చేసే వంటకం రుచిని పెంచుతాయి. మంచి వాసనతో పాటు, రుచిని కూడా అందిస్తాయి. అయితే వీటిని నిల్వ ఉంచే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఎందుకంటే గాలి చొరబడి సీసాల్లో ఉన్న మసాలాలు వాసనను, రుచిని రెండిటినీ కోల్పోతాయి. ఇలా కావడం వల్ల రుచి, వాసనా లేని దినుసుల్నే వాడుకోవలసి వస్తుంది. అందుకని ఈ సుగంధ ద్రవ్యాలను భద్రపరుచుకునే చిట్కాలను తెలుసుకుందాం.

ఇందుకోసం పాటించాల్సిన ఐదు చిట్కాలు ఏంటంటే..

గాలి చొరబడని కంటైనర్లు..

సుగంధ ద్రవ్యాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని సీసాలను ఎంచుకోవాలి. మామూలుగానే సుగంధ ద్రవ్యాలు తేమను ఆకర్షించే ధోరణి కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని గాలికి దూరంగా ఉంచాలి. గాలి లోపలికి వెళ్లకుండా చూసుకోవాలంటే కంటైనర్ మూతలు టైట్ గా ఉండాలి.

కూల్ స్టోరేజ్..

సుగంధ ద్రవ్యాలను గాలి చొరబడని కంటైనర్లలో ఉంచాకా.. గాలి పెద్దగా తగలని ప్రదేశంలో నిల్వ చేయాలి. వీటిని చాలా కాలంపాటు తాజాగా, రుచిగా ఉంచుకోవాలంటే వాటిని వేడి పొయ్యిల పక్కన, వేడి తగిలే విధంగా ఉంచకూడదు. వేడి తగిలేలా ఉంచితే ఈ దినుసులు రుచిని కోల్పోతాయి.

ఇది కూడా చదవండి: బ్లాక్ క్యారెట్‌తో కలిగే 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...!


తేమ..

వర్షాకాలంలో సుగంధ ద్రవ్యాలను ఎక్కవసేపు తెరిచి ఉంచినా కూడా గాలి చొరబడి కంటైనర్‌లో నిల్వ చేసినప్పటికీ రుచిని, వాసనను కోల్పోతాయి.

లేబుల్..

ప్రతి సీసా మీదా అందులో వేసిన దినుసు పేరు రాయడం వల్ల పదే పదే సీసాల మూతలను తీయాల్సిన పని ఉండదు. వెంటనే గుర్తించి కావాల్సిన వాటినే తీసుకుని వాడతాం.

అవసరాన్ని బట్టి..

మసాలా దినుసులను ఒకే సారి కొనుగోలు చేసి పెట్టుకున్నా వాటిని నిల్వ చేయడం ఇబ్బందిగా మారిపోతుంది. కాబట్టి కావాల్సిన విధంగా అవసరాన్ని బట్టి కొని వాడుకోవడం మంచిది.


మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి)

Updated Date - Jan 09 , 2024 | 01:18 PM