Share News

Nitish Kumar: జీవితాంతం ఎన్‌డీఏలోనే ఉంటానన్న నితీశ్.. ఇండియా కూటమిపై విమర్శలు

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:30 PM

జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Nitish Kumar: జీవితాంతం ఎన్‌డీఏలోనే ఉంటానన్న నితీశ్.. ఇండియా కూటమిపై విమర్శలు

పట్నా: జీవితాంతం ఎన్డీఏ(NDA)లోనే కొనసాగుతానని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) అన్నారు. బీజేపీ(BJP)తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత నితీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. "రాష్ట్ర ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతూనే ఉంటా. ఇండియా కూటమికి మరో పేరు పెట్టాలని కాంగ్రెస్‌ను కోరాను. కానీ వారు నా మాట వినలేదు. నేను చేసిన ఒక్క సూచనను కూడా వారు పరిగణలోకి తీసుకోలేదు. వారు.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. కూటమి నేతల ప్రవర్తనతో విసిగెత్తిపోయాను. చివరికి మా పాత మిత్రపక్షం ఎన్డీఏకు తిరిగి వచ్చాను. ఇకపై ఎక్కడికీ వెళ్లను. ఫిబ్రవరి 10న కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతోంది" అని అన్నారు.


ఖండించిన కాంగ్రెస్..

నితీశ్ కుమార్.. ఇండియా కూటమిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఖండించారు. నితీశ్ ఆరోపణల్లో వాస్తవాలు లేవని అన్నారు. ఇన్నాళ్లు ప్రధాని మోదీ యూటర్న్‌ల మాస్టార్ అని అనుకున్నామని.. నితీశ్ అంతకు మించి ఉన్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Jan 31 , 2024 | 04:31 PM