Share News

UPSC EPFO ​​PA Recruitment: ఈపీఎఫ్ఓలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:54 PM

UPSC EPFO ​​PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్..

UPSC EPFO ​​PA Recruitment: ఈపీఎఫ్ఓలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల..
UPSC EPFO PA recruitment

UPSC EPFO ​​PA Recruitment: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో పర్సనల్ అసిస్టెంట్ (PA) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in లో మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మొత్తం 323 PA పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులకు అర్హతలు, అప్లికేషన్ విధానం, ఎంపిక విధానం వంటి వివరాలు ఓసారి చూద్దాం.

వయోపరిమితి: అభ్యర్థులు మార్చి 27, 2024 నాటికి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హత: అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ పోస్ట్‌కు అవసరమైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: అభ్యర్థులు రూ. 25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫీమేల్/ఎస్సీ/ఎస్టీ/బెంచ్‌మార్క్ వైకల్యం కలిగిన వ్యక్తులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

EPFO PA రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు ఇలా చేయండి..

అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in కి వెళ్లాలి.

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో పర్సనల్ అసిస్టెంట్ కోసం దరఖాస్తుపై క్లిక్ చేయండి: 2024

OTR రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఫారమ్‌ను నింపి, ఫోటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేయాలి. రుసుము చెల్లించి సబ్‌మిట్ కొట్టాలి.

మీరు నింపిన అప్లికేషన్ ఫామ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

భవిష్యత్ అవసరాల కోసం దానిని ప్రింటౌట్ తీసుకోవాలి.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌‌లో చెక్ చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 07 , 2024 | 10:54 PM