Share News

Uddhav Tackeray: ప్రజాస్వామ్యం ఖూనీ .. సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఉద్ధవ్

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:58 PM

శివసేన వర్గాల మధ్య 2022లో తలెత్తిన వివాదంలో ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనే నిజమైన శివసేన అంటూ మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ తన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు.

Uddhav Tackeray: ప్రజాస్వామ్యం ఖూనీ .. సుప్రీంకోర్టుకు వెళ్తామన్న ఉద్ధవ్

ముంబై: శివసేన (Shiv Sena) వర్గాల మధ్య 2022లో తలెత్తిన వివాదంలో ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేనే నిజమైన శివసేన అంటూ మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narvekar) తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (UBT) నేత ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray)తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీకర్ తన తీర్పుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్‌గా సీఎం ఏక్‌నాథ్ షిండేను అడ్డుకోలేమని, 37 మంది ఎమ్మెల్యేల మద్దతున్న షిండే వర్గమే నిజమైన శివసేన అని స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటికే ఉద్ధవ్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.


''నేను ముందే చెప్పాను. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఆయన తీర్పు నిలవదు. ఈ ట్రిబ్యునల్ (స్పీకర్) తీర్పు సుప్రీంకోర్టు తీర్పుకంటే ఉన్నతమైనదా? సుప్రీంకోర్టే అత్యున్నత మైనదా? అనేది చూస్తాం. ఇండియాలో ప్రజాస్వామ్యమనేది ఉందా అని నేను తరచు ఆందోళన గురవుతుంటాను. దేశంలో సుప్రీంకోర్టు ఉందా అని ఇవాళ నాకు ఆశ్చర్యం కలుగుతోంది'' అని థాకరే అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసు చాలా చిన్నదనీ, దీనిపై కోర్టు స్పష్టంగా నిర్దేశించినప్పటికీ అసెంబ్లీ స్పీకర్ సరిగ్గా అర్ధం చేసుకోలేదని అన్నారు. సొంత కోర్టు, సొంత తీర్పుతో సుప్రీంకోర్టు కంటే తాను అధికుడిగా స్పీకర్ అనుకున్నట్టు ఉందని విమర్శించారు. కాగా, ఇది బీజేపీ కుట్ర అని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. స్పీకర్ రూలింగ్‌ను సుప్రీంకోర్టులో తమ పార్టీ సవాలు చేస్తుందని చెప్పారు.

Updated Date - Jan 10 , 2024 | 08:58 PM