Share News

Agni-5 Missile: అగ్ని-5 క్షిపణి భారత్‌కు ఎందుకు గేమ్ ఛేంజర్ అవుతుంది.. చైనాకు ఎలా చెక్ పెడుతుంది?

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:48 PM

సోమవారం ‘మిషన్ దివ్యాస్త్ర’లో (Mission Divyastra) భాగంగా అగ్ని-5 క్షిపణికి (Agni-5 Missile) సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్‌ విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్ (VK Saraswath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశపు సెకండ్-స్ట్రైక్ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు.

Agni-5 Missile: అగ్ని-5 క్షిపణి భారత్‌కు ఎందుకు గేమ్ ఛేంజర్ అవుతుంది.. చైనాకు ఎలా చెక్ పెడుతుంది?

సోమవారం ‘మిషన్ దివ్యాస్త్ర’లో (Mission Divyastra) భాగంగా అగ్ని-5 క్షిపణికి (Agni-5 Missile) సంబంధించి నిర్వహించిన తొలి ఫ్లైట్ టెస్ట్‌ విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్ (VK Saraswath) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భారతదేశపు సెకండ్-స్ట్రైక్ సామర్థ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. ఇది భారత్‌కు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక క్షిపణితో భారీ వినాశనాన్ని సృష్టిస్తుందని చెప్పారు. దీని పుణ్యమా అని భవిష్యత్తులో శత్రు దాడికి వ్యతిరేకంగా తక్కువ క్షిపణులు ప్రయోగించవచ్చని తెలిపారు. దీనిని ఫోర్స్ మల్టిప్లైయర్ అంటారని వివరించారు. ఇది ఆయుధ ప్రభావ సామర్థ్యాన్ని పెంచుతుందని అన్నారు.


చైనాకు చెక్ ఎలా?

ప్రస్తుతం చైనా వద్ద డాంగ్‌ఫెంగ్-41 (Dongfeng-41) పేరుతో కొన్ని క్షిపణులు ఉన్నాయి. ఇవి 12,000 కి.మీ నుంచి 15,000 కి.మీ రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదించగలవు. అందుకు పోటీగానే భారత్ ‘అగ్ని-5’ క్షిపణి ప్రాజెక్ట్‌ను చేపట్టింది. 5వేల కి.మీలకు మించిన దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే సత్తా ఈ మిస్సైల్‌కు ఉంది. ఇది చైనా ఉత్తర భాగం, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆసియా ఖండంలోని పలు దేశాలను టార్గెట్ చేయగలదు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్‌వీ) టెక్నాలజీతో పనిచేసేలా ఈ మిస్సైల్‌ను DRDO తయారు చేసింది. దీంతో.. ఈ సాంకేతికత కలిగిన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, రష్యా వంటి దేశాల జాబితాలో మన భారత్ చేరిపోయింది.

ప్రధాని మోదీ అభినందనలు

సోమవారం అగ్ని-5 క్షిపణి తొలి ఫ్లైట్ టెస్ట్‌ సక్సెస్ కావడంతో.. DRDO శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కొనియాడారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికతతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం.. మన దేశ రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని కూడా పేర్కొన్నారు. DRDO శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నానని అన్నారు. రాష్ట్రపతి ముర్ము సైతం ఈ ప్రయోగాన్ని ఓ మైలురాయిగా అభివర్ణించారు. భారత్ మరింత గొప్ప భౌగోళిక-వ్యూహాత్మక సామర్థ్యాల దిశగా సాగుతున్న ప్రయాణంలో.. ఇదొక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 03:48 PM