Share News

Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..

ABN , Publish Date - Mar 14 , 2024 | 09:49 PM

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ ( Petrol ), డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

Petrol Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంధన ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా పెట్రోల్ ( Petrol ), డీజిల్ రేట్లు తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తగ్గిన ధరలు రేపు ( శుక్రవారం ) ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి రానున్నాయి. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.100 తగ్గించింది. ఇదే బాటలో పెట్రోల్, డీజిల్ ధరలనూ తగ్గిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగిపోవటంతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. నిత్యవసర వస్తువుల ధరలు సైతం పెరగటంతో మూడు పూటలా కడుపు నిండా తినలేకపోతున్నారు. ఈ క్రమంలో తగ్గిన ఇంధన ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. అయితే.. ఎన్నికల సమయంలోనే కేంద్రానికి ప్రజలు గుర్తుకు వస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పెంచేటప్పుడు అధికంగా పెంచి, తగ్గించేటప్పుడు అరకొర విదిలిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 14 , 2024 | 09:49 PM